జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం : కప్పర ప్రసాదరావు

జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం : కప్పర ప్రసాదరావు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం షామీర్పేట సమీపంలోని ఉప్పరపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలు ఏకగ్రీవంగా తీర్మానించారు. IFWJ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహణ హైదరాబాదులో కానీ యాదగిరిగుట్టలో నిర్వహించాలని తీర్మానించారు. అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న ద్వంద విధానాలు అవలంబిస్తున్నారనీ కేబుల్ ఛానల్ల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి సరికాదనీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించారు. హక్కు ప్రకారం కార్డులు ఇవ్వకుండా జర్నలిస్ట్ లను ఇబ్బంది పెడుతున్న ధోరణిపై ఉద్యమాలు చేయాలని TJU నిర్ణయించ...