Posts

బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Image
 బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నల్గొండ : స్థానిక ఎల్పీటి మార్కెట్ ప్రాంగణంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి జె వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకట్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు అదే నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని, ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువత మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కారణంగా తెలంగాణ భవిష్యత్తును కోల్పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. బంగారు తెలంగాణ మాటలకు పరిమితం కాకుండా ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు సాగాలని అన్నారు, లేని సందర్భంలో భవిష్యత్తులో భారతీయ జనతా యువమోర్చా కార్యాచరణకు ప్రభుత్వం బలికాక తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి, దాసరి సాయి కుమార్, వట్టికోడు దుర్గ జీవన్, మధు, నవీన్, సౌజన్య, కల్పన, నాగమణి, భరత్, దీక్షిత్, అభిరామ్ తదిత...

నల్లగొండ పట్టణ రోడ్లకు 88 కోట్ల రూపాయలు మంజూరు

Image
నల్లగొండ  పట్టణ రోడ్లకు 88 కోట్ల రూపాయలు మంజూరు. వివేకానంద విగ్రహం నుండి పెద్ద బండ జంక్షన్ వయా బస్టాండ్ రోడ్ల అభివృద్ధి కి 46 కోట్లు. పట్టణం లోని వివిధ జంక్షన్ ల అభివృద్ధికి 4 కోట్లు. DEO ఆఫీస్ నుండి కలక్ట్రెట్ వరకు 18 కోట్లు. కలెక్ట్రేట్ నుండీ కేశరాజుపల్లి వరకు డివైడరింగ్ సెంట్రల్ లైటింగ్ 5 కోట్లు. సాగర్ Xరోడ్ నుండీ కతల్ గూడెం వరకు 6 lane రోడ్డు 15 కోట్లు నేడు హైదరాబాద్ లో మంత్రులు KTR జగదీశ్ రెడ్డి,MLA కంచర్ల...ఉన్నతధికారులతో సమావేశం.

పునఃప్రారంభం కానున్న నల్గొండ సరస్వతి శిశుమందిర్

Image
పునఃప్రారంభం కానున్న  నల్గొండ సరస్వతి  శిశుమందిర్ నల్గొండ:  మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డు హనుమాన్ దేవాలయం లో సరస్వతీ శిశు మందిర పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్ధుల సమావేశ ము జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య వక్త RSS విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ గారు మార్గదర్శనం చేస్తూ సమాజంలో శిశు మందిరాల ఆవశ్యకతను వివరించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం లోనే విద్యాభ్యాసం ఆంగ్ల మీడియా లోనే కొనసాగుతున్నా దని వివరించారు. ఈ ప్రయత్నంలో ముందుగా జిల్లా లో ఉన్న కొన్ని పాఠశాలలు మూత బడ్డాయి వాటిని పునః ప్రారంభం చెయ్యాలని ఈ విషయంలో పూర్వ విద్యార్ధుల భాగస్వామ్యం చాలా అవసరం అని అన్నారు. సరస్వతి విద్యాపీఠం నుండి వచ్చిన పతకమూరి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ దేశంలో మొదటి సారి గా ఉత్తర ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో 1952 లో శ్రీ సరస్వతీ శిశు మందిరం ప్రారంభం జరిగిందని, ఆ నేపద్యంలో నే మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాలో నీ నిర్మల్ లో 1962లో విద్యాభార తికి అనుబంధం గా సరస్వతి శిశు మందిర నిర్మాణం జరిగింది అని, ఆ తరువాత 1973,లో సరస్వతీ విద్యా పీఠం పేరున రాష్ట్ర వ్యాప్తంగా...

ఆర్యవైశ్య మహాసభ నల్గొండ జిల్లా కార్యదర్శి, కోశాధికారుల నియామకం

Image
 ఆర్యవైశ్య మహాసభ  నల్గొండ జిల్లా కార్యదర్శి, కోశాధికారుల నియామకం నల్గొండ: గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక వైశ్య భవన్ లో జాతీయ పతాక అవిష్కరణ చేసిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు అనంతరం జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శిగా నల్లగొండకు చెందిన యామ దయాకర్, కోశాధికారిగా చండూర్ కు చెందిన సముద్రాల వెంకన్న, అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ మండలానికి చెందిన లక్ష్మీశెట్టి శ్రీనివాస్ లను నియమిస్తూ నియామక పత్రాలు జ  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు కోటగిరి దైవాధీనమ్, తేలుకుంట్ల జానయ్య, బండారు వెంకటేశ్వర్లు, గోవిందు బాలరాజు, తల్లం గిరీష్ కుమార్, వాసవీ క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, కార్యదర్శి వీరెల్లి సతీష్ కుమార్, నాయకులు నూనె కిషోర్, దారం కృష్ణ, బండారు సురేష్, నాగుబండి రామకృష్ణ, నేలంటి సాయి, గుమ్మడవెల్లి ధనయ్య .తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త -నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Image
*సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త... ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు.* *సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయండి.* *టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి.* *నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి*  సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో సైబర్ నేరగాళ్లు మీకు క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. దేశంలో ఇలాంటి సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్  మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఉద్యోగాల , క్రెడిట్ కార్డుల,బ్యాంక్ అకౌంట్ పిన్ చేంజ్ ,లాటరీల ,గిఫ్ట్ ల  పేరుతో మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడ...

భూపతి టైమ్స్ ఈ పేపర్ జనవరి 22, 2022 ఈ క్రింది లింక్ టచ్ చేసి చదవండి

Image
https://drive.google.com/file/d/1DfwEyj2kVbXeznUcUPEGitQ_8M3izUZA/view?usp=drivesdk

ఈ క్రింది లింక్ టచ్ చేసి జనవరి 14 తేదీ భూపతి టైమ్స్ చదవండి https://drive.google.com/file/d/1BLEhB6peQQKNrhJ_sX9oJMI2Wt_pLMAP/view?usp=drivesdk

Image
  ఈ క్రింది లింక్ టచ్ చేసి జనవరి 14 తేదీ  భూపతి టైమ్స్ చదవండి https://drive.google.com/file/d/1BLEhB6peQQKNrhJ_sX9oJMI2Wt_pLMAP/view?usp=drivesdk

బాతుల మధు కు ఆర్ధిక సహాయం అందించిన ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్

Image
  బాతుల మధు కు ఆర్ధిక సహాయం అందించిన   ZPTC,  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్  హైదరాబాద్:  కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మరియు తెలంగాణ రాష్ట్ర వాలిబాల్ టీం కెప్టెన్ బాతుల మధు  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న వాలిబాల్ పోటీలలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగి  హైదరాబాద్ లోని చంపపేట్ ఓనస్  హాస్పిటల్లో  చికిత్స పొందుతున్న బాతుల మధు ను తలకొండపల్లి ZPTC,  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్  పరామర్శించ్చారు.  మధు కు మనో ధైర్యాన్ని కల్పించిఆర్థిక సాయం  అందచేశారు.  హాస్పటల్  సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, జంగారెడ్డి పల్లి హనుమాన్ టెంపుల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మండల యువ నాయకులు కృష్ణ నాయక్, సూర్య పేపర్ విలేకరి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర తల భాగం మిస్టరీని ఛేదించి పోలీసులు

Image
 *హతుడి వివరాలు కనుగొన్న పోలీసులు* ■ నల్గొండ జిల్లా ● దేవరకొండ: ◆ నిన్న  ఉదయం చింతపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి వివరాలను  పోలీసులు కనుగొన్నారు.  గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల మెట్టు మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే. ◆ ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపడంతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను  కనుగొన్నారు. ◆ హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యం పాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) తండ్రి శంకర్ నాయక్ గా పోలీసులు  గుర్తించారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలుసుకున్నారు. ◆ ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస...

మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్.

Image
 నల్లగొండ : మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్. హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న మంత్రి.  ఇటీవల తనను కలిసిన వారిని పరీక్ష చేసుకోవాలని సూచించిన మంత్రి.