Posts

ఓపెన్ స్కూల్ గడువు పొడిగింపు

Image
ఓపెన్ స్కూల్ గడువు పొడిగింపు  ఓపెన్ టెన్త్  ఇంటర్ ప్రవేశాలకు  అపరాధ రుసుముతో  గడువు పొడిగింపు  నవంబర్  25 నుండి  డిసెంబర్   6 వరకు    పొడిగించారని  దూర విద్యా కేంద్రం  డైరక్టర్  సైదయ్య తెలిపారు.  ఈ అవకాశాన్ని  జిల్లా ప్రజలందరూ  వినియోగించుకోగలరని  ఆయన కోరారు.  ఒక సంవత్సరంలో  ఇంటర్  పూర్తి వివరాలకు  సైదయ్య  దూర విద్య  కేంద్రం 9398424844 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.  

10 వేల మందితో VBG ఆధ్వర్యంలో వన భోజనాలు

Image
 10 వేల మందితో VBG ఆధ్వర్యంలో  వన భోజనాలు హైదరాబాద్: VBG-ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల  కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని  VBG ఫౌండర్ యం. రాజు  తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆలేరు లోని భువన సూర్య రిసార్ట్స్లో దాదాపు పదివేల మందితో VBG  ఫౌండేషన్  ఆధ్వర్యంలో  వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యము అందజేయడం జరుగుతుందని,  మరియు వివిధ జిల్లాల నుండి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా రాగలరని మనవి చేశారు. 

వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ

Image
  వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలు రద్దు పై తీర్మానం చేస్తామన్నారు.

రాష్ట్రానికో పద్ధతి.. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. నేను కూడా వస్తున్నా - కేసీఆర్

Image
 రాష్ట్రానికో పద్ధతి.. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. నేను కూడా వస్తున్నా - కేసీఆర్ కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతిని కేంద్రం అవలంభిస్తోదని అన్నారు. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది.. కేంద్రం కుదరదంటోంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తేల్చాలన్నారు  సీఎంకేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి లో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలిని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ వ్యవహార...

వీరెల్లి వాహనం ద్వంసం

Image
  వీరెల్లి వాహనం ద్వంసం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ,బిజెపి రాష్ట్ర నాయకులు  వీరెల్లి చంద్రశేఖర్ వాహనాన్ని ధ్వంసం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు  బండి సంజయ్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు  కేంద్రాల్లో నెలలతరబడి పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతన్నలు పడుతున్న అవస్థలని పరిశీలించడం కోసం వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు  భాజపా నాయకులపై వాహనశ్రేణుల పై దాడులు జరపడం జరిగింది  .

*ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..*

Image
 *ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..* *పోలీస్ స్టేషన్ లో టూవీలర్ మాయం...* *కాపలా కాయల్సిన పోలిసే దొంగ గా మారిన వైనం* *విషయం తెలిసి అవాక్కైన తోటి పోలీసులు...* *నర్సంపేట పోలిస్ స్టేషన్ లో ఘటన..* *హెడ్ కానిస్టేబుల్ అరెస్టు.. రిమండ్ కు తరలింపు...* నర్సంపేట స్థానిక పోలీస్ స్టేషన్లో టూవిలర్ మాయం కావడంతో పోలీసులు ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవీందరు నిందితునిగా గుర్తించి ఆదివారం ఆయనను అరెస్టు చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల పట్టణంలో తన చెప్పుల షాపులో దొంగతనం చేయగా అతనితో పాటు అతడు ఉపయోగించిన టూవీలర్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని అట్టి దొంగపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా పోలీస్ స్టేషన్లో ఉన్న టూవీలర్ను హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పోలీస్టేషన్ నుంచి ఎవరు లేని సమయంలో మాయం చేసి సదరు వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని అప్పచెప్పినట్లు తెలిసింది. పోలీస్టేషన్లో ఉన్న టూవీలర్ మాయం కావడంతో పోలీసులు హవాక్కయ్యారు. ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్ కానిస్టేబుల్ రవీందర్ టూవీలర్ను దొంగచాటుగా అ...

రైతుల పట్ల సీఎం గజిని గా మారాడు - బండి సంజయ్

Image
 రైతుల పట్ల సీఎం  గజిని గా మారాడు - బండి సంజయ్ నల్గొండ:  సీఎం రైతుల పట్ల గజిని గా మారాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నల్గొండ జిల్లా లో ధాన్యం సేకరణ కేంద్రాల్లో  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,  కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నల్గొండ అర్జాలబావి ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను  కెసిఆర్ తప్పుదారి పట్టిస్తున్నాడని,గతంలో ప్రతి గింజ నేనే కొంట అని ఇపుడు మాట మారుస్తుండని దుయ్యబట్టారు. ఇపుడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు. రాత్రిముబావుళ్ళు కల్లాలో వద్ద పడిగాపులు గాస్తున్న  రైతుల పై టిఆర్ఎస్ కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారని అన్నారు. మేము ఇక్కడికి వస్తామని ముందుగానే షెడ్యూల్  ఇచ్చామని, అయిన పోలీసులు విఫలమయ్యారని  అన్నారు. మీరు కొనుగోళ్లు ఎందుకు ప్రారంభిస్తాలేరుని గతంలో 1800 ఉన్న మద్దతు ధర ను 1960 కి పెంచింది కేంద్రం మని, రాష్ట్ర ముఖ్యమంత్రి గజిని వేషాలు మానుకోవ...

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15 - దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య

Image
  ఓపెన్ స్కూల్  ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15 ఓపెన్ స్కూల్ ప్రవేశానికి నవంబర్ 15 చివరి రోజని  దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ లో    ఒకే సంవత్సరంలో  ఇంటర్  పూర్తి చేసుకోవచ్చు  వివరాలకు  9398424844 సంప్రదించవచ్చు 

రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Image
రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైన బీజేపీ. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తారు.  ఉదయం  నల్గొండ అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను  సందర్శించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు.  అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుస్తారు. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేస్తారు. ఎల్లుండి (16.11.2021 ) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో   పర్యటిస్తారు.      

ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రిలియస్ట్ ఫోరమ్

Image
 ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను  కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య  ఇండస్ట్రిలియస్ట్   ఫోరమ్ హైదరాబాద్:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఉప్పల్ భాగాయత్ లో  5 ఎకరాలు కేటాయించారని, అందులో మా ఫోరమ్ కు ఒక ఎకరం కేటాయించాలని మంత్రి  కేటీఆర్ ను ఫోరమ్ నిర్వాహకులు కోరుతు వినతి పత్రం అందచేస్తున్నారని తెలిసింది.  వినతి  పత్రం లో మా ఫోరం 2019 లో  ప్రారంభించామని,  2010లో    రిజిస్టర్డ్  చేసామని,  దాదాపు వివిధ   ప్రొడక్టులు   మ్యాన్యుఫ్యాక్చరింగ్   చేస్తున్న   వెయ్యి సంస్థల  వారు  మా ఫోరంలో  సభ్యులుగా  ఉన్నారని   పేర్కొనటున్నట్లు తెలిసింది.  మా ఫోరం తరఫున  సెమినార్లు,  స్పీకర్ మీటింగ్స్,   ట్రైనింగ్   సెషన్స్  నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా  మహిళా లకు  పారిశ్రామికంగా  ప్రోత్సహించేందుకు స్కిల్స్ను  పెంపొందించేందుకు  ఎక్స్ పర్ట్ తో   ట్రెయినింగ్  మా స్వంత...