*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటం*

*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటం* - తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని -కరీంనగర్ నూతన కమిటీ నియామకం హైదరాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో అపరిషృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల సాధనకు సమరశీల పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాలో శుక్రవారం రోజున టిజేఏ జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ నగునూరి అద్వర్యం లో రాష్ట్ర అధ్యక్షుడు నారగొని పురుషోత్తం ఆదేశాల మేర ప్రకటించడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని అధ్యక్షుడిగా , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్ ను నియమించినట్లు పురుషోత్తం నారగౌని తెలిపారు. అలాగే జిల్లా గౌరవాధ్యక్షుడిగా దీపక్ బాబు, ఉపాధ్యక్షుడిగా శ్రీ క్రాంతికుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆడెపు రవికుమార్, కోశాధికారిగా శ్రీ రాపెల్లి కుమార్ ను నియమించామని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప...