కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*


 


కలక్టరేట్ లో  ఓ అపరిచితుడు

 *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ  అధికారి*

నల్గొండ:   అగ్రకుల అహంకారం తో   ఉద్యోగులను వేధిస్తున్న ఓ అధికారి. నేను మొనర్కును నేను బాస్ ను నేను ఏది చిపితే  డ్యూటీ లో భాగం కానివి కూడా చేయాలి లేకుంటే మీ సంగతి తెలుస్తానని వేధిస్తున్న  సదరు అధికారి. అప్పుడే బాగుండి అంతలోనే అపరిచితుడుగా, మాన సిక రోగిగా మారుతు,   నేను అటెండెన్స్ రిజిస్టర్  దాచిపెట్టిస్తా, సెలవులు ఇవ్వా, మెడికల్ బిల్లు లు చేపించా, జీతం బిల్లులు  పై సంతకాలు పెట్టా అని బెదిరించి  శాడిజంతో ఆనందపడుతున్నాడు ఆ అధికారి. ఓ మహిళ ఉద్యోగి రెండు రోజులు సెలవు పెడితే సెలవు చిట్టి నాకు ఇవ్వలేదని జీతం కట్ చేయాలని చూసిన ఆ అధికారి. సెలవు చిట్టి ఇద్దామంటే  ఆ అధికారి  అఫిస్కు వస్తే గదా ఇచ్చేది  అని వాపోతున్న ఉద్యోగులు.  ఇన్వార్డ్ లో ఇద్దామంటే ఇన్వార్డ్ క్లర్క్ ను  తీసుకోవద్దని ఆదేశించిన అధికారి. ఆ ఆఫీస్ లో ఇన్వార్డ్ ను కూడా పనిచేయకుండా  నిరంకుశంగా  వ్యవహరిస్తున్న అధికారి. ట్రాన్స్ఫర్ అయిన ఓ ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ఇవ్వకుండా బాధపెట్టి సంబర పడుతున్న ఈ అధికారి.

 జిల్లా కలెక్టరేట్ కు క్రొత్త ఉన్నత అధికారి వచ్చినప్పటికి  స్వతంత్ర దినోత్సవం రోజున కలెక్టరేటకు డుమ్మా కొట్టిన సదరు అధికారి.  గతం లో ఉద్యోగులు ఇతర సంఘాలు ఈ అధికారి పై జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినప్పటికి ఏమి చర్యలు లేకపోవడంతో నన్నేం చేస్తారు అని ధీమాతో రెచ్చిపోయి వేధిస్తున్న అధికారి. 

ఈ మధ్యనే కొందరికి ఆ అధికారి ఫెవర్ చేసి కొత్త సెల్ ఫోన్ గిఫ్ట్ గా పొందినట్లు సమాచారం.  ఆఫిస్ టివి ని, ఫర్నిచర్ ను  ఇంట్లో పెట్టుకున్న  సందర్భాలు  కూడా ఉన్నాయని ఆరోపణలు.

  వేదనకు గురి అవుతూ నష్ట పోతున్న  మాకు ఫిర్యాదు చేయడానికి శక్తి లేదని, చేస్తే ఎక్కడ మా ఉద్యోగాలకు నష్టం వస్తుందోనని భయపడుతు, ఇప్పటి కైన ఉద్యోగ సంఘ నాయకులు పట్టించుకోని  పై అధికారులకు ఫిర్యాదు చేసి మమ్ముల రక్షించాలని బిక్కు బిక్కు గా ఎదురుచూస్తున్న ఉద్యోగులు. 

గతం లో పేరుతో ఇచ్చిన ఫిర్యాదులను   పై అధికారులు చెత్తబుట్టలో వేయడంతో పేరు వ్రాయడానికి  మా ప్రతినిధికి కూడా ఆసక్తి చూపలేదు. 

Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్