ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్ హైదరాబాద్: భారత రాజ్యాంగం ఆర్టికల్ 32 ఏ ప్రకారం రాష్ట్రాలలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ లు 1987 యాక్టు ప్రకారంగా ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా న్యాయవాదు లను నియమించి బీద వారికి సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ సహాయం అందిస్తారు. ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఈ చట్టం క్రింద 5 ఏండ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీదలకు సహాయం అందించారని, ఎంత మంది న్యాయ వాదులను నియమించారని, ఎంత డబ్బు ఖర్చు చేశారో సమాచారం ఇప్పించమని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి మరియు ప్రజా సమాచార అధికారి కి ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఈ అథారిటీ ప్రజా సమాచార అధికారి సమాచారం జిల్లా ల నుండి తీసుకోమ్మని బదులు ఇచ్చారు. ఈ విషయం పై సాయికుమార్ మా ప్రతినిధి తో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 4 ప్రకారంగా ప్రజా సమాచార అధికారి ఇతర అధికారుల సహారం తీసు...