Posts

Showing posts from August, 2022

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

Image
 స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరిగిన భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  ఈసందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను  చైర్మెన్ గారు అందజేశారు. అదేవిధంగా ఉత్తమ పనితీరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లకు పురస్కారాలను అందజేశారు. వేడుకలలో భాగంగా పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన పెరేడ్ ఇన్‌స్పెక్షన్‌ను ను చైర్మెన్  వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు, నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జు...

ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న ఆఫీసర్?

Image
    ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న  ఆఫీసర్? హైదరాబాద్: ఇక ట్రాన్స్ఫర్ లు అవుతాయని తెలియగానే దీపం ఉండ గానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే  సూత్రాన్ని ఆదర్శముగా తీసుకొని ఓ అధికారి  ఇల్లు చక్కబెట్టుకున్నట్లు తెలిసింది.  దాదాపు  మస్తు  పరిశ్రమల పబ్లిక్ హియరింగ్ కు పునుకొని బాగానే దండుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయు. ఈయన పోకడ చూసి జర జాగ్రత్త బాబు  ట్రాన్స్ఫర్ ముందు  అని తోటి అధికారులు చెప్పిన కూడా రిస్క్ తీసుకున్నట్లు   తెలిసింది. పాపం క్రింది స్థాయి ఉద్యోగులు మాకు కనీసం టీ కూడా ఇప్పించలేదని వాపోతున్నారు. ఈయన చేపట్టిన అన్ని హీయరింగ్  రాష్ట్ర స్థాయి అధికారులు ఒక కన్ను వేయాలని వారు కోరుతున్నారు.