తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదు: పెద్ద పురం నరసింహా , బింగి స్వామి

 

తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదు: పెద్ద పురం నరసింహా , బింగి స్వామి


తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ ,టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


శనివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం  సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ  TJU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

20 తారీఖున తగిరిగుట్టలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సన్నాహక సమావేశాలు విజయవంతం చేయాలన్నారు. ఇళ్ళ స్థలాలు,హెల్త్ కార్డు ఏమయ్యాయని రాష్ట్రంలో పెద్ద యూనియన్లు అని చెప్పుకుంటున్న యూనియన్ లో వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్న అన్నారు. తెలంగాణ వచ్చినంక జర్నలిస్టుకు అయిన లాభమేందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా జరగబోయే జాతీయ సమావేశాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో జర్నలిస్టులకు అనేక అవమానాలు జరుగుతున్నాయని ప్రభుత్వమే జర్నలిస్టులకు అన్యాయం చేస్తుందన్నారు. వచ్చిన తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టు నిజంగా నష్టపోయారని ఆంధ్ర జర్నలిస్టులు లబ్ధి చెందారని అన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్