జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం : కప్పర ప్రసాదరావు


 జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం : కప్పర ప్రసాదరావు


తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం  తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


శనివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం   షామీర్పేట సమీపంలోని ఉప్పరపల్లిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 ఈ సమావేశంలో వివిధ అంశాలు ఏకగ్రీవంగా తీర్మానించారు.

IFWJ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహణ హైదరాబాదులో కానీ యాదగిరిగుట్టలో  నిర్వహించాలని తీర్మానించారు.

అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న ద్వంద విధానాలు అవలంబిస్తున్నారనీ కేబుల్ ఛానల్ల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి సరికాదనీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించారు.

హక్కు ప్రకారం కార్డులు ఇవ్వకుండా జర్నలిస్ట్ లను ఇబ్బంది పెడుతున్న ధోరణిపై ఉద్యమాలు చేయాలని TJU నిర్ణయించింది.

DPRO,I&PR లో జరుగుతున్న అవకతవకలపై  పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసారు. (చిన్న పత్రికలు కేబుల్ ఛానల్ సాధన కమిటీ ) ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కన్వీనర్ గా భారత్ కుమార్ శర్మ నియమిస్తూ తీర్మానం చేశారు 

IFWJ జాతీయ కార్యవర్గ సమావేశంలో హైదరాబాదులో నిర్వహించాలని తీర్మానించడం  ఇందుకోసం వివిధ కమిటీలు పరిశీలించడం వేయడం జరిగింది.

రాష్ట్ర కమిటీ సమావేశాలను తిరిగి 20వ తేదీన నిర్వహించాలని  ఈ సమావేశాన్ని యాదగిరిగుట్టలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది చిన్నపత్రికలు కేబుల్ ఛానల్ కు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు తగ్గకుండా యాడ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. వార,మాస పత్రికలకు కూడా నెల నెల ఆడ్స్ ఇవ్వాలని తీర్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్,

రాష్ట్ర కార్యదర్శి బర్ల శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వల్లపు శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య ,ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బాపు రావు ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ,యాదాద్రి భువనగిరి జిల్లా  శానూర్ బాబా ,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దాసన్న ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుక్కల రాజు ,G.వెంకన్న యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదాద్రి భువనగిరి గౌరవ  అధ్యక్షులు మత్యాస్, అశోక్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ సుదర్శన్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్ ,సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రమేష్ ,రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ నరసింహ ,రంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయికుమార్, సిద్దిపేట జిల్లా సెక్రెటరీ శ్రీకాంత్ చారి, సిద్దాల రవి,గండ నరేందర్, సాయి శరత్, కట్టెల సోమరాజు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్