34 వార్డు పరిధిలోని వెంకటేశ్వర కాలనీ లో పర్యటించిన మునిసిపల్ కమీషనర్ రమణాచారి


 34 వార్డు పరిధిలోని వెంకటేశ్వర కాలనీ లో పర్యటించిన మునిసిపల్ కమీషనర్ రమణాచారి


నల్గొండ:  మున్సిపల్ కమిషనర్ రమణాచారి 34 వార్డు పరిధిలో వెంకటేశ్వర కాలనీ లో పర్యటించి .  వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు . వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు వార్డులో ఉన్న సమస్యలను వివరించారు. వర్షాకాలంలో గుట్ట నుంచి వచ్చే వరద ను మళ్ళించాలని, కోతుల బెడద తీవ్రంగా ఉన్నదని వాటిని నివారించాలని, ముఖ్యంగా దేవాలయం ముందుగా వెళ్లే ప్రధాన మురుగు కాల్వలు శుభ్ర పరిచి తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున కాలువ పైన స్లాపు నిర్మించాలని, కాలనీలో గల పార్కును పునరుద్ధరించాలని,లక్ష్మీ నగర్ కాలనీ వీటి కాలనీ మధ్యలో ఆక్రమించిన రోడ్డును క్లియర్ చేయాలని, దారా గోవర్ధన్ , వెలిశాల ప్రభాకర్ గారి  ఇంటి మధ్యలో ఉన్న డ్రైనేజి పునర్నిర్మించాలని ,కొన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు లను ఏర్పాటు చేయాలని,గుడికి వెళ్ళే దారి లో  దేవులపల్లి రామచంద్ర ఇంటి ముందు సిసి రోడ్ దెబ్బ తిన్న నందున దానిని తిరిగి పునర్నిర్మించాలని కమిషనర్ కు ఈ సందర్భంగా  వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు దేవాలయ కమిటీ సభ్యులు కాలనీ కమిటీ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్