సేవలో సరిలేరు వైశ్యులకెవ్వరు - తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది

సేవలో సరిలేరు వైశ్యులకెవ్వరు - తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది హైదరాబాద్ : శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవా సమితి - మల్కాజిగిరి వారు ప్రచురించిన శ్రీ శుభక్రుత్ నామ సంవత్సర పంచాంగము ను తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల నిర్వహణ లో వైశ్యులకు సాటి మరొకరు లేరని అన్నారు.సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న మల్కాజిగిరి సేవా సమితి వారిని అభినందించారు. వాసవీ పొలిటికల్ ఫోరమ్ ఫౌండర్ ఛైర్మన్, కీసర గుట్ట శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఫౌండర్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, వైశ్యుల్లో ఐక్యత పెంపొందాలన్నారు. వైశ్యులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కోసం వాసవీ పొలిటికల్ ఫోరమ్ నిర్మాణాత్మక క్రుషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు పోకల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి శ్రీనివాస్, లింగా రామ్మోహనరావు, దూబగుంట అశోక్, చంద్రయ్య గుప్త కె సి క్రిష్ణ గుప్త, వెంకటేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.