బాతుల మధు కు ఆర్ధిక సహాయం అందించిన ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
బాతుల మధు కు ఆర్ధిక సహాయం అందించిన ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
హైదరాబాద్: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మరియు తెలంగాణ రాష్ట్ర వాలిబాల్ టీం కెప్టెన్ బాతుల మధు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న వాలిబాల్ పోటీలలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగి హైదరాబాద్ లోని చంపపేట్ ఓనస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాతుల మధు ను తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరామర్శించ్చారు. మధు కు మనో ధైర్యాన్ని కల్పించిఆర్థిక సాయం అందచేశారు. హాస్పటల్ సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, జంగారెడ్డి పల్లి హనుమాన్ టెంపుల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మండల యువ నాయకులు కృష్ణ నాయక్, సూర్య పేపర్ విలేకరి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment