ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గరు మృతి
నల్గొండ జిల్లా..
దామరచర్ల మండలం
బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వాడపల్లి కి చెందిన అన్నాచెల్లెళ్ళు ధనావత్ అంజి నాయక్, ధనావత్ అంజలి ,వారి అల్లుడు 8 ఏళ్ల నవదీప్ లు అక్కడికక్కడే మృతి చెందారు....అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... కేస్ నమోదు చేసిన పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు...
Comments
Post a Comment