మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర తల భాగం మిస్టరీని ఛేదించి పోలీసులు
*హతుడి వివరాలు కనుగొన్న పోలీసులు*
■ నల్గొండ జిల్లా
● దేవరకొండ:
◆ నిన్న ఉదయం చింతపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు కనుగొన్నారు.
గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల మెట్టు మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే.
◆ ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపడంతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి
దర్యాప్తు చేసి హతుడి వివరాలను కనుగొన్నారు.
◆ హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యం పాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) తండ్రి శంకర్ నాయక్ గా పోలీసులు గుర్తించారు.
జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని
తెలుసుకున్నారు.
◆ ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని ఎవరు అత్య చేసివుంటారు?తల ఆలయంలో పెట్టిన హాంతకులు శరీర భాగాన్ని ఎక్కడ వదిలి వెళ్లారు?ఆతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మూఢనమ్మకాలతో
ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారా?ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Post a Comment