పునఃప్రారంభం కానున్న నల్గొండ సరస్వతి శిశుమందిర్
పునఃప్రారంభం కానున్న నల్గొండ సరస్వతి శిశుమందిర్
నల్గొండ: మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డు హనుమాన్ దేవాలయం లో సరస్వతీ శిశు మందిర పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్ధుల సమావేశ ము జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య వక్త RSS విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ గారు మార్గదర్శనం చేస్తూ సమాజంలో శిశు మందిరాల ఆవశ్యకతను వివరించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం లోనే విద్యాభ్యాసం ఆంగ్ల మీడియా లోనే కొనసాగుతున్నా దని వివరించారు. ఈ ప్రయత్నంలో ముందుగా జిల్లా లో ఉన్న కొన్ని పాఠశాలలు మూత బడ్డాయి వాటిని పునః ప్రారంభం చెయ్యాలని ఈ విషయంలో పూర్వ విద్యార్ధుల భాగస్వామ్యం చాలా అవసరం అని అన్నారు. సరస్వతి విద్యాపీఠం నుండి వచ్చిన పతకమూరి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ దేశంలో మొదటి సారి గా ఉత్తర ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో 1952 లో శ్రీ సరస్వతీ శిశు మందిరం ప్రారంభం జరిగిందని, ఆ నేపద్యంలో నే మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాలో నీ నిర్మల్ లో 1962లో విద్యాభార తికి అనుబంధం గా సరస్వతి శిశు మందిర నిర్మాణం జరిగింది అని, ఆ తరువాత 1973,లో సరస్వతీ విద్యా పీఠం పేరున రాష్ట్ర వ్యాప్తంగా శిశు మందిరాల స్థాపన జరిగింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర లో177. పాఠశాల లు నేడు ఆంగ్ల మీడియా లోనే విద్యాభ్యాసం చేస్తున్నాయని తెలియ జేశారు. అయితే మన శిశు మందిరాలలో చదివిన పూర్వ విద్యార్ధుల ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో మూత బడిన పాఠశాల లు పునః ప్రారంభం చెయ్యాలని కోరుతూ ఉన్నారు. ఈ కార్యంలో భాగంగానే ఇక్కడ జరుగుతున్న సమావేశం ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో సరస్వతి విద్యాపీఠం
స్వర్ణోత్సవాల సందర్భంగా మనం ప్రతీ జిల్లా కేంద్రంలో తప్పని సరిగా ఒక సరస్వతి శిశు మందిరం ను ఏర్పాటు చేయాలని కోరుతున్న అని అన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్ధుల కమిటీని నియమించింది దానిలో లకడాపురం వెంకటేశ్వర్లు.ఓరుగంటి వంశీ. నీలకంఠం హరి రామ కృష్ణ. నీలకంఠం జయరామ్ కృష్ణ. పులిపాటి దయాకర్. కస్పరాజ్ వెంకటేశ్వర్లు. ఎడ్ల తిరుమలేశ్, గంజి లక్ష్మినారాయణ. అనుముల రవీంద్ర చారీ రాఘవేంద్ర చారి గార్లు శిశు మందిర ప్రారంభం కోసం సమయము ఇచ్చి పని చేస్తారని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ విద్యా పీఠం ప్రతినిధి p. నరేందర్ రావు,పూర్వ విద్యార్థుల లు పూర్వ ఆచార్యులు దేవాలయ కమిటీ సభ్యులు చింతా హరి ప్రసాద్ గారు రాములు గారు మొదలగు వారు పాల్గొన్నారు.
Comments
Post a Comment