సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త -నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
*సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త... ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు.*
*సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయండి.*
*టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి.*
*నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి*
సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో సైబర్ నేరగాళ్లు మీకు క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. దేశంలో ఇలాంటి సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఉద్యోగాల , క్రెడిట్ కార్డుల,బ్యాంక్ అకౌంట్ పిన్ చేంజ్ ,లాటరీల ,గిఫ్ట్ ల పేరుతో మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడటం ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తామని, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నారు.కొత్తగా క్రెడిట్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న వారికి క్యాష్ బ్యాక్ వచ్చిందని నమ్మిస్తున్నారు, ఆఫర్లకు ఆకర్షితులై నకిలీ ఫేస్బుక్ ఖాతాలో ఉండే సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. వారికి సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తాయి. నిజమైన బ్యాంకు ఎగ్జిక్యూటివ్ గాని మాట్లాడి.. అవతలి వ్యక్తి నుంచి ఆధార్, పాన్ వివరాలు సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.ఇలా సేకరించిన సమాచారాన్ని డీప్ వెబ్లో అమ్మకానికి పెడ్డటం, కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు. ఎవరైనా వివరాలు చెబితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము కాజేస్తున్నారు అని రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు
*ఫిర్యాదు నమోదుకు మీ దగ్గర ఉండాల్సినవి..*
• ఫిర్యాదుదారుడి ఫోన్ నంబరు
• ఖాతా ఉన్న బ్యాంకు పేరు, వాలెట్ పేరు
• బ్యాంక్ అకౌంట్ నంబరు, వాలెట్, మర్చంట్ ఐడీ, యూపీ ఐడీ నంబర్లు
• లావాదేవి జరిపిన ఐడీ, తేదీ, సమయం
• డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగితే వాటి నంబర్లు
• మోసానికి సంబంధించిన లావాదేవీలు స్క్రీన్ షాట్లను తీసిపెట్టుకోవాలి.
*ఫిర్యాదు ఎక్కడ చేయాలి:*
• సైబర్ క్రైం జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబరు 155260/112/100 కాల్ చేసి పిర్యాదు చేయవచ్చు
•www.cybercrime.gov.in
Comments
Post a Comment