మంత్రుల పర్యటనలో జీవో 327 ఉల్లంఘన పై చర్యలు తీసుకోండి - రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు డా. జి. మనోహర్ రెడ్డి డిమాండ్
మంత్రుల పర్యటనలో జీవో 327 ఉల్లంఘన పై చర్యలు తీసుకోండి - రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు డా. జి. మనోహర్ రెడ్డి డిమాండ్
నల్గొండ: నల్గొండ పట్టణంలో మంత్రుల పర్యటనలో జీవో 327 కు విరుద్ధంగా కోవిడ్ నియమాలను పాటించకుండా ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డా||జి.మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యలయంలో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ జీవో విడుదల ప్రతి పక్షాలు సమావేశాలకేనా. అధికార పార్టీ సమావేశాలకు, ర్యాలీలకు వర్తించదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో ఇమిక్రాన్ పెరగకుండా జనవరి 2 వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించ కూడదని డిసెంబర్ 25 జీవో ను విడుదల చేశారని, ఈ జీవో అధికార పార్టీకి వర్తించదా అని ప్రశ్నిచారు. బీజేపీ నిరుద్యోగ దీక్ష కు అనుమతి కోరితే జీవో పేరు చెప్పి అనుమతులు ఇవ్వకపోవడం తో పరిమితి సంఖ్యలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఈ జీవో ను ఉల్లంఘించి ర్యాలీ సమావేశాలు నిర్వహించినందున డిజాస్టర్ మనేజ్మెంట్ చట్ట ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ ల పై కేసులు పెట్టాలని, మాస్కులు పెట్టుకొని వారి పై వెయ్యి రూపాయల జరిమాన విధించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ని కలిసి పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి , స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ గార్లపాటి జితేంద్ర కుమార్, పోతేపాక సాంబయ్య , బొజ్జ శేఖర్, దాయం భూపాల్ రెడ్డి ,దాసరి సాయి,మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment