317 జీవో తో ఉద్యోగుల మృతి కి ప్రభుత్వమే భాద్యత వహించాలి - బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
317 జీవో తో ఉద్యోగుల మృతి కి ప్రభుత్వమే భాద్యత వహించాలి - బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
నల్గొండ: ఉద్యోగాలు కొరకు తెలంగాణ యువత కొట్లాడుతుంటే ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వం ఎక పక్షముగా ఇచ్చిన 317 జీవో తో ఉద్యోగులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఉద్యోగుల మృతికి ప్రభుత్వమే భాద్యతగా వహించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హుజుర్నగర్ లో జాయిన వెంటనే గుండె పోటుతో మరణించిన నాగిళ్ల మురళీధర్ ఆయన స్వగ్రామం నర్సింగ్బట్ల లో అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ
నాగిళ్ల మురళీధర్ మృతి దురదృష్టకరమైన సంఘటన కుటుంభానికి తీరనిలోటని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఉద్యోగాలు కావాలని తెలంగాణ యువతి యువకులు కొట్లాడుతుంటే ఇంకో పక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చనిపోయేటువంటి పరిస్థితి రావడమనేది బాధాకరమైన విషయం మని విమర్శించారు. ప్రభుత్వం ఏదైన ఒక నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగ సంఘాలతోని ,ఉపాధ్యాయ సంఘాలతోని చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, ఇటీవల జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. మహబుబబాద్ లో జైత్రం నాయక్ అనే ప్రధానోపాధ్యాయుడు చనిపోయినప్పుడయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులు , పంతాలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఎక్కడ సమస్యలు వున్నాయి అని చర్చించి ఉంటే బాగుండేదని, ఇరవై,ముప్పై కిలోమీటర్ల పరిధిలో వున్న స్కూల్ లకు వెళ్లోచ్చే ఉపాద్యాయులను నేడు వంద కిలో మీటర్ల దూరానికి బదిలీ చేయడం వలన మనస్థాపానికి గురై డ్యూటీలో నే మరణిస్తున్నారుని అన్నారు. వెంటనే మురళీధర్ కుటుంబంలోని వారి అబ్బాయి క్వాలిఫికేషన్ బెస్ చేస్తూ నెల రోజుల లోపల న్యాయం చేస్తూ రిక్రూట్ మెంట్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 317 జీ ఓ గురించి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కార్యాలయం లో దీక్ష చేస్తే టెర్రరిస్టులను చూసినట్టు చూసి కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేసిన ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఎట్లా పెడదాం ,జైలుకు ఎట్లా పంపిద్దాం అనేటువంటి ధ్యాస ను పక్కన పెట్టి 317 జీ ఓ నీ సవరించి ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరుపున డిమాండు చేస్తున్నామని తెలిపారు. NSR ఫౌండేషన్ నాగార్జున సాగర్ తరపున మృతుని కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కు ద్వారా నాగార్జున సాగర్ ఇంచార్జి కంకణాల నివేధిత బాధిత కుటుంబాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి, ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, భూపతి రాజు, యదగిరాచారి, కొండేటి సరితా, కొండ భవాని, బోగరి అనిల్, ఎమ్. వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డి, కాశమ్మ,
నీరజ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment