బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నల్గొండ : స్థానిక ఎల్పీటి మార్కెట్ ప్రాంగణంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి జె వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకట్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు అదే నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని, ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువత మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కారణంగా తెలంగాణ భవిష్యత్తును కోల్పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. బంగారు తెలంగాణ మాటలకు పరిమితం కాకుండా ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు సాగాలని అన్నారు, లేని సందర్భంలో భవిష్యత్తులో భారతీయ జనతా యువమోర్చా కార్యాచరణకు ప్రభుత్వం బలికాక తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి, దాసరి సాయి కుమార్, వట్టికోడు దుర్గ జీవన్, మధు, నవీన్, సౌజన్య, కల్పన, నాగమణి, భరత్, దీక్షిత్, అభిరామ్ తదిత...