RSS హిందూ శక్తి సంగమం విజయవంతం చేయాలి - సంఘ చాలక్ ఇటిక్యాల కృష్ణయ్య
నల్లగొండ జిల్లా కేంద్రంలో రేపు ఆదివారం డిసెంబర్ 12 న జరగబోయే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ శక్తి సంగమం, జిల్లా మహా సాంఘిక్ సార్వజనిక ఉత్సవాన్నీ విజయవంతం చేయాలని ఆరెస్సెస్ జిల్లా సంఘ చాలక్ (జిల్లా అధ్యక్షులు) ఇటిక్యాల కృష్ణయ్య కోరారు.
ఆరెస్సెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవాహా) దత్తాత్రేయ హోసబలే నల్లగొండ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంలో వారికి స్వాగత సూచకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.. నల్లగొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరెస్సెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి వెంకటయ్య తో కలిసి ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు . దత్తాత్రేయ హూసబలే రాక సందర్భంగా జిల్లా లోని సుమారు 5వేల మంది స్వయం సేవకులు పూర్తి సంఘ గణవేష్ తో వారికి స్వాగతం పలికేందుకు నల్లగొండకు వస్తున్నరని తెలిపారు. స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే ఈ కార్యక్రమం కొసమ్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్వయం సేవకులు పట్టణంలోని మూడు ప్రధాన మార్గాల ద్వారా రూట్ మార్చ్ సంఘ క్రమశిక్షణ తో వచ్చి క్లాక్ టవర్ సెంటర్ లో కలిసి, అక్కడి నుంచి ఎన్జీ కళాశాల వరకు ప్రదర్శనగా వస్తారని అన్నారు. అక్కడ కొద్దిసేపు స్వయం సేవకుల వ్యాయామ ప్రదర్శన అనంతరం ప్రధాన వక్త దత్తాత్రేయ హూసభలే ప్రసంగం ఉంటుందని అన్నారు. నల్లగొండ జిల్లా సంఘ చరిత్రలో ఇది అతిపెద్ద కార్యక్రమం అనీ, దీన్ని విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. అలాగే హిందూ బంధువులు అందరూ కూడా కుటుంబాల సమేతంగా తరలివచ్చి ఈ హిందూ శక్తి సంగమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment