అభివృద్ధి కార్యక్రమాల మంజూరు కొరకు కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించనున్న ఎమ్మెల్యే కంచర్ల




 

అభివృద్ధి కార్యక్రమాల మంజూరు కొరకు కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించనున్న ఎమ్మెల్యే కంచర్ల

 నల్గొండ: డిసెంబర్ 29న  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నల్లగొండ పర్యటనకు వచ్చే అవకాశం ఉండటంతో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  నల్లగొండ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించనున్నారు.  ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక నాగార్జున డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు కొరకు డీపీఆర్ సిద్ధంచేసి ముఖ్యమంత్రి సమర్పించనున్నారు.  ఈ సందర్భంగా నేడు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు, ఆరువేల మంది విద్యార్థులకు అవసరమగు అత్యాధునిక వసతులతో కూడిన భవన నిర్మాణానికి అవసరమగు నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేయనున్నoదున అవసరమగు డీపీఆర్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంఅంతా  కళాశాల అధ్యాపకులు ఇంజనీరింగ్ అధికారులతో .. కలియతిరిగి సూచనలు ఇచ్చారు. కార్యనిర్వాహక ఇంజనీర్ అనిత, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్, స్థానిక కౌన్సిలర్ ఖయ్యుం బేగ్,  సందినేని జనార్దన్ రావు, దేప వెంకట్ రెడ్డి, గాదె రామ్ రెడ్డి,కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్