ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ని సన్మానించిన జిల్లా మినీ రైస్ మిల్స్ అసోషియేషన్
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ని సన్మానించిన జిల్లా మినీ రైస్ మిల్స్ అసోషియేషన్
నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా మినీ రైస్ మిల్ అసోసియేషన్ వారు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ని కలుసుకొని తమకు ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు తో సమానంగా సీఎంఆర్, FCI ధాన్యం తమకు కూడా కేటాయించడానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియ చేసి పుష్పగుచ్చం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎఫ్సీఐ దాన్యం తమకు కేటాయించాలని చాలా సంవత్సరాలగా పోరాడుతున్న నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి చొరవ తీసుకొని ఫార్ బాయిల్డ్ రైస్ మిల్స్ అసోసియేషన్ ను ఒప్పించి అటు ప్రభుత్వ అధికారులను తమకు కూడా సీఎంఆర్ ధాన్యం కేటాయించే విధంగా విశేష ప్రయత్నం చేసి తమ మినీ రైస్ మిల్లు లను ఆదుకున్నారని తెలిపారు. గతంలో ఏ నాయకుడు కూడా సమస్య పరిష్కారానికి ఇంతచొరువ చూపలేదని ఇందుకు మేము వారికి రుణపడి ఉంటామని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త కందుకూరు మహేందర్, మినీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుజ్జల జనార్దన్ రెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మినీ రైస్ మిల్ అసోసియేషన్ కు చెందిన యజమానులు పాల్గొన్నారు.
Comments
Post a Comment