పాముకాటుకు గురైన *సల్మాన్ ఖాన్*
పాముకాటుకు గురైన *సల్మాన్ ఖాన్*
ముంబయి:-బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు.
గత కొన్నిరోజులుగా సల్మాన్ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది.
దీంతో, సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
విషం లేని పాము కాటువేయడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.
మరోవైపు సల్మాన్ పాముకాటుకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Post a Comment