దేశంలోని విద్యారంగ సమస్యలపై నిరంతరం ఉద్యమాలు - ABVP
దేశంలోని విద్యారంగ సమస్యలపై నిరంతరం ఉద్యమాలు - ABVP
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లిలో గల వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో ABVP ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన కార్యకర్తల విభాగ్ అభ్యాస వర్గ లో భాగంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈప్రారంభ ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ABVP తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి యమాగౌని కరుణాకర్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అనంతరం స్వతంత్ర భారతంలో విద్యార్థులను సన్మార్గంలో నడిపించడానికి దేశ రక్షణ కోసం ప్రారంభమైన ABVP నేడు ఎన్నో విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేస్తూ విద్యార్థులను జాతీయవాదులు గా తయారు చేసి ఈ దేశం కోసం ఆలోచించే విధంగా చేయడం కోసం ఏబీవీపీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ఈ రెండు రోజుల శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు జాతీయవాద సైద్ధాంతిక విషయాలపై ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ ప్రమోద్ కుమార్ ,చెరుకు రవికుమార్, నవీన్ రావు, పల్లగొర్ల విష్ణు,ఠాకూర్ నీతూ సింగ్, లక్ష్మణ్,పొట్టిపాక నాగరాజు,మణికంఠ,హరీష్, సంపత్,నందిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment