అభివృద్ధి కార్యక్రమాల మంజూరు కొరకు కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించనున్న ఎమ్మెల్యే కంచర్ల
అభివృద్ధి కార్యక్రమాల మంజూరు కొరకు కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించనున్న ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ: డిసెంబర్ 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నల్లగొండ పర్యటనకు వచ్చే అవకాశం ఉండటంతో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించనున్నారు. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక నాగార్జున డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు కొరకు డీపీఆర్ సిద్ధంచేసి ముఖ్యమంత్రి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా నేడు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు, ఆరువేల మంది విద్యార్థులకు అవసరమగు అత్యాధునిక వసతులతో కూడిన భవన నిర్మాణానికి అవసరమగు నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేయనున్నoదున అవసరమగు డీపీఆర్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంఅంతా కళాశాల అధ్యాపకులు ఇంజనీరింగ్ అధికారులతో .. కలియతిరిగి సూచనలు ఇచ్చారు. కార్యనిర్వాహక ఇంజనీర్ అనిత, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు...