మందు బాబులకు శుభవార్త మద్యం షాపుల సంఖ్య పెంపు
మందు బాబులకు శుభవార్త మద్యం షాపుల సంఖ్య పెంపు
హైదరాబాద్ : మందు బాబులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. దాంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరిగింది.
అలాగే డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపింది.
గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల కేటాయించినట్టు ఆ శాఖ పేర్కొంది.
ఓపెన్ క్యాటగిరీ కింద 1,864 మద్యం దుకాణాలు మిగిలాయని చెప్పింది.
మంగళవారం నుంచి ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించి ఈనెల 20న డ్రా ద్వారా కేటాయించనున్నారు.
Comments
Post a Comment