*ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..*
*ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..*
*పోలీస్ స్టేషన్ లో టూవీలర్ మాయం...*
*కాపలా కాయల్సిన పోలిసే దొంగ గా మారిన వైనం*
*విషయం తెలిసి అవాక్కైన తోటి పోలీసులు...*
*నర్సంపేట పోలిస్ స్టేషన్ లో ఘటన..*
*హెడ్ కానిస్టేబుల్ అరెస్టు.. రిమండ్ కు తరలింపు...*
నర్సంపేట స్థానిక పోలీస్ స్టేషన్లో టూవిలర్ మాయం కావడంతో పోలీసులు ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవీందరు నిందితునిగా గుర్తించి ఆదివారం ఆయనను అరెస్టు చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల పట్టణంలో తన చెప్పుల షాపులో దొంగతనం చేయగా అతనితో పాటు అతడు ఉపయోగించిన టూవీలర్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని అట్టి దొంగపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా పోలీస్ స్టేషన్లో ఉన్న టూవీలర్ను హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పోలీస్టేషన్ నుంచి ఎవరు లేని సమయంలో మాయం చేసి సదరు వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని అప్పచెప్పినట్లు తెలిసింది. పోలీస్టేషన్లో ఉన్న టూవీలర్ మాయం కావడంతో పోలీసులు హవాక్కయ్యారు. ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్ కానిస్టేబుల్ రవీందర్ టూవీలర్ను దొంగచాటుగా అట్టి వ్యక్తికి అప్పచెప్పినట్లు తెలిసింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది.....
Comments
Post a Comment