*రేపు ఢిల్లీకి ఈటల.. టూర్ పై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ*

*రేపు ఢిల్లీకి ఈటల.. టూర్ పై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ*


*హుజురాబాద్* ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కనబరచడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఈటలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కాల్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. కాగా గెలుపు అనంతరం ఈటల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటల గెలుపు అనంతరం బీజేపీలో జోష్ మరింత ఎక్కువైంది. వాస్తవానికి హుజురాబాద్లో బీజేపీకి అనుకున్నంత కేడర్ లేదు. కేవలం ఈటల చరిష్మాతోనే ఉప ఎన్నిక బీజేపీ వశమైంది. కాగా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. *ఢిల్లీ పర్యటనలో అధిష్టానం సైతం భవిష్యత్ కార్యాచరణకు ఇదే దూకుడును కొనసాగించాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.



 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్