ఈటల కు చెందిన జమున హేచరీస్ కు నోటీసులు
ఈటల కు చెందిన జమున హేచరీస్ పై 16వ తేదీన విచారణ.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం అయింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16న విచారణ చేపట్టనున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డికి చెందిన జమున హెచరీస్‌కు గతంలోనే నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూన్‌లోనే నోటీసులు జారీచేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీచేసినట్టుగా చెబుతున్నారు. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.
Comments
Post a Comment