కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్
కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్
హైదరాబాద్: కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ హైకోర్టు లో పిల్ దాఖలు చేశానని ఒక ప్రకటన లో తెలిపారు. కరోనాతో తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారని దాదాపు 1లక్షా 20వేల మంది చనిపోయారని అంచనా ఉన్నదని, కానీ కేవలం 3912 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుదని, సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా బాదిత కుటుంబాలకు రూ. 50వేల రూపాయిలు సాయం ప్రకటించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు కారణంగా1లక్షా 20వేల బాదితులు వుంటే కేవలం 3912 మందికి మాత్రమే సాయం అందే పరిస్థితి వుందని, మరి మిగతా వారందరికీ ఎవరు న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ఆర్ధిక సాయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో బాదిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల అసలు సంఖ్య బయటకి రావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకి పోకుండా కోవిడ్ డెత్ ఆడిట్ నిర్వహించి వాస్తవ మరణాలని వెల్లడించి బాదితులందరీకి న్యాయం చేయాలని కోరారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా బాదిత కుటుంబాలకు రూ. 50వేలు సాయం ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యని తక్కువగా చేసి చూపిన టీఆర్ఎస్ ప్రభుత్వం బాదిత కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం కోవిడ్ మరణాల సంఖ్యని దాచి పెట్టిందని, కరోనా మరణాలపై దుర్మార్గంగా వ్యవహరించింది'' అని మండిపడ్డారు దాసోజు, రాష్ట్రంలో అసలు కరోనానే లేదనే బ్రాంతి కల్పిస్తూ ఫస్ట్, సెకండ్ వేవ్ కలుపుకొని కేవలం 3912 మంది మాత్రమే కరోనా కారణంగా చనిపోయారని ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. కానీ దాదాపు 1లక్షా 20వేల మంది చనిపోయారని స్పష్టమైన సమాచారం వుంది. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా బాదిత కుటుంబాలకు 50వేల రూపాయిలు సాయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 3912 మంది మాత్రమే చనిపోయారని దొంగ లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం చెబుతున్న దొంగ లెక్కలు కారణంగా 1లక్షా 20వేల బాదితులు వుంటే కేవలం 3912 మందికి మాత్రమే సాయం అందే పరిస్థితి వుంది ? మరి మిగతా వారందరికీ ఎవరు న్యాయం చేస్తారు ? అందుకే భేషజాలకు పోకుండా కరోనా మరణాలపై కరోనా డెత్ ఆడిట్ ని ఏర్పాటు చేసిన బాదితులందరికీ న్యాయం జరిగేలా చూడాలి'' అని కోరారు దాసోజు.
Comments
Post a Comment