*ప్రజా* *సమస్యలపై* *సత్వరమే* *స్పందించాలి* *అదనపు* *జిల్లా* *కలెక్టర్* *యస్.మోహన్* **రావు*
*ప్రజా* *సమస్యలపై* *సత్వరమే* *స్పందించాలి*
*అదనపు* *జిల్లా* *కలెక్టర్* *యస్.మోహన్* **రావు*
సూర్యాపేట: (మహమ్మద్ గౌసుద్దీన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుండి ప్రజలు వివిధ సమస్యలపై అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యస్ మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా వివిధ రకాల భూ సమస్యల దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు ప్రజావాణిలో భూ సమస్యల పై 24 అలాగే ఇతర శాఖలకు సంబందించి 19 దరఖాస్తులు మొత్తం 43 దరఖాస్తులు అందాయని ఆయా శాఖల అధికారులు అట్టి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు
ఈ సమావేశంలో డి పి ఓ యాదయ్య సి పి ఓ వెంకటేశ్వర్లు పి డి ఐసీడీఎస్ జ్యోతి పద్మ ఈ డి శిరీష ఏ ఓ శ్రీదేవి వివిధ శాఖల అధికారులు దరఖాస్తు దారులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment