రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ డిమాండ్


 రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్ డిమాండ్ 


హైదరాబాద్: టీఆర్ఎస్, బిజెపి తోడు దొంగలు. చేతకాని సన్నాసి ప్రభుత్వాల కారణంగా నిరుద్యోగంతో యువత బలి. రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.


దేశంలో 20కోట్ల మంది నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులకు కారణం టీఆర్ఎస్ , బిజెపి ప్రభుత్వాలని ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు. ప్రజలకు పని కల్పించాలనే కనీస సోయిలేని వారు రాష్ట్రంలో కేంద్రంలో పాలకులుగా వుండటం దురదృష్టమని అన్నారు.


స్టార్ట్ అప్ ఇండియా , స్టాండ్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా పధకాలు నినాదాలుగా మిలిపోయాయి తప్పా నిర్మాణాత్మక అభివృద్ధిలో బాగస్వామ్యం కాలేదన్నారు.


రాష్ట్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, టీ హబ్, ఐటిఐర్ పధకాలు సరిగ్గా అమలు చేయకపోవడం, స్వయం ఉపాది కూడా కల్పించకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు.


రాష్ట్రం ఏర్పడిన నాటికి పదిజిల్లాలకి కలిపి మొత్తం శాంక్షన్ పోస్టులు 4,97, 882.  అందులో 3,99, 866 భర్తీ. 98, 016 ఖాళీలు. ఏడేళ్ళ కేసీఆర్ పాలన తర్వాత  (33 జిల్లాలకు ) మొత్తం శాంక్షన్ పోస్టులు 4,91, 304. అందులో 3,00, 178 భర్తీ .ఖాళీలు 1,91, 126. పది జిల్లాలకు  3,99, 866 ఉద్యోగాలు వుంటే 33 జిల్లాలైన తర్వాత ఉద్యోగాలు సంఖ్య ఎలా తగ్గుతుంది. కొత్తగా ఏర్పడి కొత్త జిల్లాలు, మండలాలు, పెరిగిన పరిపాలన యంత్రాంగంతో ఉద్యోగాలు పెరగాలి. కానీ తగ్గిందంటే అసలు కేసీఆర్ పాలన చేస్తున్నారా?లేదా సన్నాసి ఆటలు ఆడుతున్నారా ? అని ప్రశ్నించారు.



కొత్త కొలువులు ఇవ్వకపోగా ఈ ఏడేళ్ళలో 52, 515 ఉద్యోగాలని తొలగించారు. కోవిడ్ సమయంలో హెల్త్ డిపార్ట్మెంట్ లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారని, ఇంతవరకూ నింపలేదని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ మాయ మాటలు తప్పితే నోటిఫికేషన్లు ఇవ్వరని ఎద్దేవా చేశారు.



తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని తమ ప్రాణాలను పణంగా పెట్టి విధ్యార్ధి నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామయ్యారని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కలల కోసం వారు పోరాటం చేశారో ఆ కలలన్నీ కల్లలైన దుర్మార్గమైన పరిస్థితి నేడు నెలకొందని పేర్కొన్నారు.



నిరుద్యోగంపై పోరాటం రాజకీయ అజెండా కాదు. సమాజం పట్ల భాద్యత, చింతన వున్న వారు చేపట్టవలసిన కర్తవ్యం. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలో నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్