రైతుల పట్ల సీఎం గజిని గా మారాడు - బండి సంజయ్



 రైతుల పట్ల సీఎం  గజిని గా మారాడు - బండి సంజయ్


నల్గొండ:  సీఎం రైతుల పట్ల గజిని గా మారాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నల్గొండ జిల్లా లో ధాన్యం సేకరణ కేంద్రాల్లో  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,  కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నల్గొండ అర్జాలబావి ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను  కెసిఆర్ తప్పుదారి పట్టిస్తున్నాడని,గతంలో ప్రతి గింజ నేనే కొంట అని ఇపుడు మాట మారుస్తుండని దుయ్యబట్టారు. ఇపుడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు. రాత్రిముబావుళ్ళు కల్లాలో వద్ద పడిగాపులు గాస్తున్న  రైతుల పై టిఆర్ఎస్ కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారని అన్నారు. మేము ఇక్కడికి వస్తామని ముందుగానే షెడ్యూల్  ఇచ్చామని, అయిన పోలీసులు విఫలమయ్యారని  అన్నారు. మీరు కొనుగోళ్లు ఎందుకు ప్రారంభిస్తాలేరుని గతంలో 1800 ఉన్న మద్దతు ధర ను 1960 కి పెంచింది కేంద్రం మని, రాష్ట్ర ముఖ్యమంత్రి గజిని వేషాలు మానుకోవాలిని హితవు పలికారు.రైతుల దృష్టిని మళ్లించడానికి, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి మీ నాటకాలని, అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తరువాత 48 గంటల్లో డబ్బులు ఇస్తున్నారని మరి నువ్వేం చేస్తున్నావని కేసీఆర్ ను ప్రశ్నించారు. నీ తాటాకు చప్పుళ్లకు బయపడనని, రైతుల కోసం రాళ్ళ దాడికి సిద్ధం మని, త్యాగాలకు సిద్ధం మని,  రైతుల కోసం బూతులు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నానాని తెలిపారు.  ఉదయం నుండి టిఆర్ఎస్ శ్రేణులు ఒక వైపు బీజేపీ శ్రేణులు ఒక ఒక వైపు మోహరించడం తో తీవ్ర ఉద్రిక్తల నడుమ సంజయ్ రైతులను కలసి వారి కష్టాల ను తెలుసుకున్నారు. టిఆర్ఎస్ రాల్లు,కోడి గ్రుడ్లు లతో దాడి చేయడం తో బీజేపీ కార్యకర్తలు వారికి దీటుగా బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి,  ప్రకాష్ రెడ్డి, జిల్లా ఇంచార్జి ప్రదీప్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, గోలి  మధుసుధన్ రెడ్డి, బండారు ప్రసాద్, వీరెల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు సిద్దు,  అధికార ప్రతినిధి  భూపతి రాజు,  మహిళ న్నాయకురాళ్లు కాశమ్మ, నీరజ, లక్ష్మీ ప్రసన్న  మరియు  భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్