పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దు-కార్యదర్శి మల్లయ్య బట్టు
పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దు-కార్యదర్శి మల్లయ్య బట్టు
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు విజ్ఞప్తి చేశారు. కొందరు నకిలీ ఏజెన్సీ వాళ్ళు అవుట్సోర్సింగ్ నియామకాలు అంటూ నిరుద్యోగులైన అభ్యర్థులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలలో ఏదైనా నియామకాలు భర్తీ చేయాల్సి ఉంటే ఆయా సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఖాళీలున్నాయి, ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని, నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Post a Comment