రాష్ట్రానికో పద్ధతి.. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. నేను కూడా వస్తున్నా - కేసీఆర్
కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతిని కేంద్రం అవలంభిస్తోదని అన్నారు. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది.. కేంద్రం కుదరదంటోంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తేల్చాలన్నారు సీఎంకేసీఆర్.
ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి లో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలిని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎంధుకు రాకూడదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో బుధవారం ప్రధానికి,వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాస్తానని అన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగా.. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పాలని.. యాసంగిలో వరి ధాన్యం వేయాలి అని చెప్పిన బండి సంజయ్ అదే మాట మీద ఉన్నడా లేదా అనేది తేలాలన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ భారీ ధర్నా చేస్తారని.. ధర్నా తర్వాత, రాజ్ భవన్‌లో గవర్నర్‌కు మెమోరాండం ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 18న ధర్నా తర్వాత కేంద్రానికి రెండు రోజులపాటు డెడ్‌లైన్ పెడుతున్నట్లుగా వెల్లడించారు. అప్పటికీ సమాధానం రాకపోతే రైతులకు ప్రత్యమ్నాయ పంటలను వేయాల్సిందిగా సూచిస్తామన్నారు.
Comments
Post a Comment