Posts

Showing posts from November, 2021

ఓపెన్ స్కూల్ గడువు పొడిగింపు

Image
ఓపెన్ స్కూల్ గడువు పొడిగింపు  ఓపెన్ టెన్త్  ఇంటర్ ప్రవేశాలకు  అపరాధ రుసుముతో  గడువు పొడిగింపు  నవంబర్  25 నుండి  డిసెంబర్   6 వరకు    పొడిగించారని  దూర విద్యా కేంద్రం  డైరక్టర్  సైదయ్య తెలిపారు.  ఈ అవకాశాన్ని  జిల్లా ప్రజలందరూ  వినియోగించుకోగలరని  ఆయన కోరారు.  ఒక సంవత్సరంలో  ఇంటర్  పూర్తి వివరాలకు  సైదయ్య  దూర విద్య  కేంద్రం 9398424844 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.  

10 వేల మందితో VBG ఆధ్వర్యంలో వన భోజనాలు

Image
 10 వేల మందితో VBG ఆధ్వర్యంలో  వన భోజనాలు హైదరాబాద్: VBG-ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల  కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని  VBG ఫౌండర్ యం. రాజు  తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆలేరు లోని భువన సూర్య రిసార్ట్స్లో దాదాపు పదివేల మందితో VBG  ఫౌండేషన్  ఆధ్వర్యంలో  వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యము అందజేయడం జరుగుతుందని,  మరియు వివిధ జిల్లాల నుండి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా రాగలరని మనవి చేశారు. 

వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ

Image
  వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలు రద్దు పై తీర్మానం చేస్తామన్నారు.

రాష్ట్రానికో పద్ధతి.. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. నేను కూడా వస్తున్నా - కేసీఆర్

Image
 రాష్ట్రానికో పద్ధతి.. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. నేను కూడా వస్తున్నా - కేసీఆర్ కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతిని కేంద్రం అవలంభిస్తోదని అన్నారు. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది.. కేంద్రం కుదరదంటోంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తేల్చాలన్నారు  సీఎంకేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి లో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలిని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ వ్యవహార...

వీరెల్లి వాహనం ద్వంసం

Image
  వీరెల్లి వాహనం ద్వంసం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ,బిజెపి రాష్ట్ర నాయకులు  వీరెల్లి చంద్రశేఖర్ వాహనాన్ని ధ్వంసం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు  బండి సంజయ్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు  కేంద్రాల్లో నెలలతరబడి పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతన్నలు పడుతున్న అవస్థలని పరిశీలించడం కోసం వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు  భాజపా నాయకులపై వాహనశ్రేణుల పై దాడులు జరపడం జరిగింది  .

*ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..*

Image
 *ఇంటి దొంగను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు..* *పోలీస్ స్టేషన్ లో టూవీలర్ మాయం...* *కాపలా కాయల్సిన పోలిసే దొంగ గా మారిన వైనం* *విషయం తెలిసి అవాక్కైన తోటి పోలీసులు...* *నర్సంపేట పోలిస్ స్టేషన్ లో ఘటన..* *హెడ్ కానిస్టేబుల్ అరెస్టు.. రిమండ్ కు తరలింపు...* నర్సంపేట స్థానిక పోలీస్ స్టేషన్లో టూవిలర్ మాయం కావడంతో పోలీసులు ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవీందరు నిందితునిగా గుర్తించి ఆదివారం ఆయనను అరెస్టు చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల పట్టణంలో తన చెప్పుల షాపులో దొంగతనం చేయగా అతనితో పాటు అతడు ఉపయోగించిన టూవీలర్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని అట్టి దొంగపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా పోలీస్ స్టేషన్లో ఉన్న టూవీలర్ను హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పోలీస్టేషన్ నుంచి ఎవరు లేని సమయంలో మాయం చేసి సదరు వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని అప్పచెప్పినట్లు తెలిసింది. పోలీస్టేషన్లో ఉన్న టూవీలర్ మాయం కావడంతో పోలీసులు హవాక్కయ్యారు. ఇట్టి విషయమై విచారణ చేయగా హెడ్ కానిస్టేబుల్ రవీందర్ టూవీలర్ను దొంగచాటుగా అ...

రైతుల పట్ల సీఎం గజిని గా మారాడు - బండి సంజయ్

Image
 రైతుల పట్ల సీఎం  గజిని గా మారాడు - బండి సంజయ్ నల్గొండ:  సీఎం రైతుల పట్ల గజిని గా మారాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నల్గొండ జిల్లా లో ధాన్యం సేకరణ కేంద్రాల్లో  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,  కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నల్గొండ అర్జాలబావి ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను  కెసిఆర్ తప్పుదారి పట్టిస్తున్నాడని,గతంలో ప్రతి గింజ నేనే కొంట అని ఇపుడు మాట మారుస్తుండని దుయ్యబట్టారు. ఇపుడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు. రాత్రిముబావుళ్ళు కల్లాలో వద్ద పడిగాపులు గాస్తున్న  రైతుల పై టిఆర్ఎస్ కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారని అన్నారు. మేము ఇక్కడికి వస్తామని ముందుగానే షెడ్యూల్  ఇచ్చామని, అయిన పోలీసులు విఫలమయ్యారని  అన్నారు. మీరు కొనుగోళ్లు ఎందుకు ప్రారంభిస్తాలేరుని గతంలో 1800 ఉన్న మద్దతు ధర ను 1960 కి పెంచింది కేంద్రం మని, రాష్ట్ర ముఖ్యమంత్రి గజిని వేషాలు మానుకోవ...

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15 - దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య

Image
  ఓపెన్ స్కూల్  ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15 ఓపెన్ స్కూల్ ప్రవేశానికి నవంబర్ 15 చివరి రోజని  దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ లో    ఒకే సంవత్సరంలో  ఇంటర్  పూర్తి చేసుకోవచ్చు  వివరాలకు  9398424844 సంప్రదించవచ్చు 

రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Image
రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైన బీజేపీ. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తారు.  ఉదయం  నల్గొండ అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను  సందర్శించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు.  అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుస్తారు. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేస్తారు. ఎల్లుండి (16.11.2021 ) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో   పర్యటిస్తారు.      

ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రిలియస్ట్ ఫోరమ్

Image
 ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను  కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య  ఇండస్ట్రిలియస్ట్   ఫోరమ్ హైదరాబాద్:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఉప్పల్ భాగాయత్ లో  5 ఎకరాలు కేటాయించారని, అందులో మా ఫోరమ్ కు ఒక ఎకరం కేటాయించాలని మంత్రి  కేటీఆర్ ను ఫోరమ్ నిర్వాహకులు కోరుతు వినతి పత్రం అందచేస్తున్నారని తెలిసింది.  వినతి  పత్రం లో మా ఫోరం 2019 లో  ప్రారంభించామని,  2010లో    రిజిస్టర్డ్  చేసామని,  దాదాపు వివిధ   ప్రొడక్టులు   మ్యాన్యుఫ్యాక్చరింగ్   చేస్తున్న   వెయ్యి సంస్థల  వారు  మా ఫోరంలో  సభ్యులుగా  ఉన్నారని   పేర్కొనటున్నట్లు తెలిసింది.  మా ఫోరం తరఫున  సెమినార్లు,  స్పీకర్ మీటింగ్స్,   ట్రైనింగ్   సెషన్స్  నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా  మహిళా లకు  పారిశ్రామికంగా  ప్రోత్సహించేందుకు స్కిల్స్ను  పెంపొందించేందుకు  ఎక్స్ పర్ట్ తో   ట్రెయినింగ్  మా స్వంత...

కేంద్రంపై రైతన్నల ధర్నా" కార్యక్రమం లో విషాదం.

 సూర్యాపేట జిల్లా   కోదాడ లో రంగా థియేటర్ వద్ద జరిగే "కేంద్రంపై రైతన్నల ధర్నా" కార్యక్రమం లో విషాదం.  ఫ్లెక్సీలు కడుతుండగా బంజర కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి, కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఖమ్మం ఆస్పత్రికి తరలింపు.  ఫ్లెక్సీలు కడుతుండగా బంజర కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి, కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఖమ్మం ఆస్పత్రికి తరలింపు.

బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు

Image
 బిజెపి  మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో  ఘనంగా  అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు నల్లగొండ  : భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా  నల్గొండ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు   ఈ కార్యక్రమంలో  మైనారిటీ రాష్ట్ర నాయకులు  పాషా మాట్లాడుతూఅబుల్ కలాం ఆజాద్ ఒక భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడని , ఇస్లామిక్ వేదాంతవేత్త , రచయిత మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడని. అతను సాధారణంగా మౌలానా ఆజాద్ అని గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. మౌలానా అనే పదానికి గౌరవప్రదమైన అర్థం 'మా మాస్టర్' మరియు అతను ఆజాద్‌ను స్వీకరించాడు ( ఉచిత) అతని కలం పేరు. భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌ను స్థాపించరని, భారతదేశం అంతటా అతని పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు అని అన్నారు .ఈ యొక్క కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్రెడ్డి , మైనారిటీ జిల్లా అధ్యక్షులు మాజిద్ .జిల్లా ఉపాధ్యక్షులు యాద గిరి చారి ,  మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి  స...

కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్

Image
కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్    హైదరాబాద్: కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్ హైకోర్టు లో పిల్ దాఖలు చేశానని ఒక  ప్రకటన లో  తెలిపారు.  కరోనాతో తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారని దాదాపు 1లక్షా 20వేల మంది చనిపోయారని అంచనా ఉన్నదని, కానీ కేవలం 3912 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుదని,  సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా బాదిత కుటుంబాలకు రూ. 50వేల రూపాయిలు సాయం ప్రకటించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు కారణంగా1లక్షా 20వేల బాదితులు వుంటే కేవలం 3912 మందికి మాత్రమే సాయం అందే పరిస్థితి వుందని, మరి మిగతా వారందరికీ ఎవరు న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ఆర్ధిక సాయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్  ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో బాదిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల అసలు సంఖ్య బయటకి  రావాలని,  టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకి పోకుండా కోవ...

తిరుమల బ్రేకింగ్ న్యూస్

 తిరుమల బ్రేకింగ్ న్యూస్ తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా విరిగి పడుతున్న కొండచరియల ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు టిటిడి భద్రతా సిబ్బంది

*అమ్మాయిలను మోసం చేసి డబ్బులు లాగుతున్న చీటర్ అరెస్ట్*

Image
*అమ్మాయిలను మోసం చేసి డబ్బులు లాగుతున్న చీటర్ అరెస్ట్*.. బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ.. సోషల్ మీడియాలో తానొక nri బుకాయింపు..  తన వివాహం కాలేదని చెప్పి సోషల్ మీడియాలో విగ్గు తో  ఉన్న ఫోటోలు పెడుతున్న కార్తీక్ వర్మ. విగ్గు  తో  చీటింగ్  చేస్తున్న కార్తీక్ వర్మ.  ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల ని మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తున్న కార్తీక్ వర్మ.. వ్యక్తిగత  సమయంలో తీసిన వ్యక్తిగత ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ పాల్పడుతున్న కార్తీక్ వర్మ .. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల ని మోసం చేసిన కార్తీక్ వర్మ..  కూకట్పల్లిలోని అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్న కార్తీక్ వర్మ .. కార్తీక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్  కార్తీక్ వర్మ పై పీడీ యాక్ట్ చేసిన పోలీసులు.  

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ డిమాండ్

Image
 రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్ డిమాండ్  హైదరాబాద్: టీఆర్ఎస్, బిజెపి తోడు దొంగలు. చేతకాని సన్నాసి ప్రభుత్వాల కారణంగా నిరుద్యోగంతో యువత బలి. రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి  డా. దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. దేశంలో 20కోట్ల మంది నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులకు కారణం టీఆర్ఎస్ , బిజెపి ప్రభుత్వాలని ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు. ప్రజలకు పని కల్పించాలనే కనీస సోయిలేని వారు రాష్ట్రంలో కేంద్రంలో పాలకులుగా వుండటం దురదృష్టమని అన్నారు. స్టార్ట్ అప్ ఇండియా , స్టాండ్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా పధకాలు నినాదాలుగా మిలిపోయాయి తప్పా నిర్మాణాత్మక అభివృద్ధిలో బాగస్వామ్యం కాలేదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, టీ హబ్, ఐటిఐర్ పధకాలు సరిగ్గా అమలు చేయకపోవడం, స్వయం ఉపాది కూడా కల్పించకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి పదిజిల్లాలకి కలిపి మొత్తం శాంక్షన్ పోస్టులు 4,97, 882.  అందులో 3,99...

వరి ని వెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తు బీజేపీ ధర్నా

Image
 వరి ని వెంటనే కొనుగోలు చెయ్యాలని  బీజేపీ ధర్నా నల్గొండ: వరి ని వెంటనే కొనుగోలు చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా కార్యక్రమం రేపు అనగా 11.11.2021 గురువారం రోజు ఉదయం 10.00 గంటలకు  చేస్తున్నట్లు  జిల్లా బీజేపీ నిమ్మల రాజశేకేర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంఛార్జి  ఆర్.ప్రదీప్ కుమార్ మరియు సహా ఇంఛార్జి  గోపి మరియు జిల్లా  అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాదక్షులు  గంగిది మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి  మాద గొని శ్రీనివాస్ గౌడ్ లి ముఖ్య అతిధులుగా పాల్గొంటారని,  ప్రతి మండలం నుండి 25 మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు  ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,వివిధ మోర్చా నాయకులు, మరియు ముఖ్య నాయకులు  ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలNఈ,  సమయానికి ముందు గానే కలెక్టరేట్ చేరుకోవాలని, జిల్లా లోని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు,కార్యక...

*మరియమ్మ లాకప్ డెత్ కేస్ సీబీఐ కి.*

 *మరియమ్మ లాకప్ డెత్ కేస్ సీబీఐ కి.* అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ మరియమ్మ మృతిపై హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్ *మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని అభిప్రాయపడిన హైకోర్టు* ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీకి ఆదేశం ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపిన ఏజీ ప్రసాద్ బాధ్యులైన క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించిన హైకోర్టు మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు తెలిపిన ఏజీ ప్రసాద్ పరిహారం ప్రాణానికి తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్య ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందన్న అడ్వకేట్ జనరల్ రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయన్న హైకోర్టు గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని వ్యాఖ్యానించిన హైకోర్టు సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమన్న హైకోర్టు సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి...

వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్...*

Image
*వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్...* ఖమ్మం నగరం కమాన్ బజార్ లో ఘటన...  రావిచెట్టు వద్ద గల వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్... బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో బైక్ అదుపు తప్పినట్లు సమాచారం... ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దుకాణదారులు, కొనుగోలుదారులు...  

వైన్ షాప్ కేటాయింపు లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం-ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయికుమార్

Image
 వైన్ షాప్   కేటాయింపు  లో  రిజర్వేషన్లు    రాజ్యాంగ విరుద్ధం-ప్రముఖ న్యాయవాది  కే.ఎన్. సాయికుమార్ హైదరాబాద్ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వైన్ షాప్   కేటాయింపు కొరకు  జీవో ఎంఎస్ 98 ని విడుదల చేసిందని  అందులో  కొన్ని వర్గాలకు  రిజర్వేషన్లు కేటాయించారని  ఇది రాజ్యాంగ విరుద్ధమని  ఆరెకటిక అభివృద్ధి సంఘం  సలహాదారు  ప్రముఖ  హైకోర్టు న్యాయవాది  మహారుషి కరకొట్ నాగేకర్ సాయికుమార్  తెలిపారు.   సారా వృత్తి, మటన్ వృత్తి    మా ఆరెకటిక  లకు జన్మహక్కు అని తెలిపారు. మా ఆరె కటికల  కార్పొరేషన్ ఏర్పాటు చేసి  ఐదు వందల  కోట్ల రూపాయలు  కేటాయించాలని  ప్రభుత్వాన్ని  కోరారు.  బి సి డి నుండి  బీసీ ఏ  గా  ఆరె కటికల  మార్చాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం

Image
 హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటెల రాజేందర్  ఈరోజు శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 

కలర్ ఫుల్ గా మారిన నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాలు...

Image
 అద్భుత కళా రూపాలతో, రంగు రంగుల పెయింటింగ్ ల తో పచ్చదనం ,పరిశుభ్రత తో కలర్ ఫుల్  గా మారిన  నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాలు... పూర్వకాలపు  సంస్ర్కుతి, సంప్రదాయాలు, వ్యవహారాలను  తెలిపే చిత్రాల ముందు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్న ప్రయాణికులు..

*ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తొలగించాలి..*

Image
 ♦️ *ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తొలగించాలి..* 👉"ఊరికి ఉత్తరాన" సినిమాలో తెలంగాణ ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. 👉రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని తలకిందులుగా ఉరితీసే సన్నివేశం పై అభ్యంతరం. 👉తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు వెంటనే తొలగించాలి. 👉లేనిపక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటాం. 👉 గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ వాల్మీకి సంఘం.

తెలుగుగేట్ వే. కామ్ కు చెందిన వాసిరెడ్డి శ్రీనివాస్ పై 50 ల‌క్షల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన ఎన్టీవీ సీఎండీ న‌రేంద్ర‌చౌద‌రి

Image
  తెలుగుగేట్ వే. కామ్ కు చెందిన వాసిరెడ్డి శ్రీనివాస్ పై 50 ల‌క్షల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన ఎన్టీవీ సీఎండీ న‌రేంద్ర‌చౌద‌రి. తెలుగుగేట్ వే. కామ్ లో ఆయ‌న‌పై ఎలాంటి వార్త‌లు రాయ‌కుండా ఇంజ‌క్షన్ ఆర్డ‌రు కోసం కూడా పిటీష‌న్ దాఖలు.

*రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై కారు బీభత్సం*

Image
 *రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై కారు బీభత్సం*  డివైడర్ ను ఢీ కొట్టిన కారు. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. క్షత గాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలింపు.  అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సన్ సిటీ నుండి మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం.  పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టిన కారు. తప్పిన పెను ప్రమాదం. పాక్షికంగా ధ్వంసమైన కారు.  స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. కారు లో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తింపు. తమ స్నేహితుడు జైద్  ఖాన్ ను సన్ సిటీ వద్ద వదలి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

నల్గొండ లో పెళ్లిల పేరుతో మోసానికి పాలడుతున్న చీటర్ అరెస్ట్...

Image
 నల్గొండ : బ్రేకింగ్..... పెళ్లిల పేరుతో మోసానికి పాలడుతున్న చీటర్ అరెస్ట్... నల్గొండ పట్టణం లోని ఓ చర్చిలో డ్రమ్స్ వాయిస్తూ.... మహిళలను లోబరుచుకున్న నిందితుడు విలియమ్స్.... తనూజ అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా సహజీవనం చేసిన విలియమ్స్.... వారం రోజుల క్రితం మరో యువతిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న చీటర్... బాధితురాలు తనూజ పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ సమయంలో గుండెపోటు డ్రామా ఆడిన విలియమ్స్.ఆస్పత్రికి తరలించిన పోలీసులు... నార్మల్ రిపోర్ట్స్ రావడంతో ఆస్పత్రి నుంచి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వన్ టౌన్ పోలీసులు.... నిందితుడిపై ఐపీసీ 376,377,382,342,420 సెక్షన్ ల కింద కేసు నమోదు.

అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు

 అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు.. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచేలా రాపిడో ప్రకటనలో నటించారని నోటీసులు.. అల్లు అర్జున్, రాపిడో సంస్థకు టీఎస్‌ఆర్టీసీ లీగల్ నోటీసులు

సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్-ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

Image
  సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్-ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్  ఇస్తామని బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడానికి అర్హులైన  వారికి అవసరమైన కోచింగ్ ను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.  సివిల్స్- 2021లో ప్రిలిమ్స్ సాధించిన యువత మెయిన్స్ కోచింగ్ కోసం ఈ నెల 15 తేదీ లోగా బీసీ స్టడీ సర్కిల్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో తమ పేరు,  వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.  తమ వివరాలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జాతి చేయాలి. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్  040 -24071178 లో సంప్రదించాలి.

పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దు-కార్యదర్శి మల్లయ్య బట్టు

Image
 పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దు-కార్యదర్శి మల్లయ్య బట్టు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల గురుకులల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు విజ్ఞప్తి చేశారు.  కొందరు నకిలీ ఏజెన్సీ వాళ్ళు అవుట్సోర్సింగ్ నియామకాలు అంటూ నిరుద్యోగులైన అభ్యర్థులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.  మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలలో ఏదైనా నియామకాలు భర్తీ చేయాల్సి ఉంటే ఆయా సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఖాళీలున్నాయి, ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని, నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకొని రైతు లకు భరోసా ఇచ్చిన బీజేపీ నాగార్జున సాగర్ ఇంచార్జ్ కంకణాల నివేధిత

Image
 గుర్రంపోడ్,పెద్దవురా,మండలాల్లో ikp వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకొని రైతు లకు భరోసా ఇచ్చిన బీజేపీ నాగార్జున సాగర్ ఇంచార్జ్ కంకణాల నివేధిత

E Shram Card: అసంఘటిత రంగంలో కార్మికుల ఖాతాల్లోకి మోడీ సర్కార్ నేరుగా డబ్బులు.. ఎలా వస్తాయో తెలుసా..

Image
E Shram Card:  అసంఘటిత రంగంలో కార్మికుల ఖాతాల్లోకి మోడీ సర్కార్ నేరుగా డబ్బులు.. ఎలా వస్తాయో తెలుసా..     అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం... అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కూలీలు, కార్మికులకు ఉపశమనం కల్పించేలా కొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ- శ్రమ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వలస కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మత్స్యకారులు, ఉపాధి హామీ కూలీలు, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు దీని ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనితో ఈ కార్మికుల డేటా ప్రభుత్వంతో తయారు చేయబడుతుంది. వారి కోసం అనేక పథకాలు ప్రారంభించబడతాయి. పథకాల ప్రయోజనాలు నేరుగా వారికి చేరుతాయి. దీనితో, కోవిడ్ -19 వంటి ఏదైనా జాతీయ సంక్షోభ సమయంలో DBT ద్వారా ఆర్థిక సహాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలకు చేరుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ పోర్టల...

మందు బాబులకు శుభవార్త మద్యం షాపుల సంఖ్య పెంపు

Image
 మందు బాబులకు శుభవార్త మద్యం షాపుల సంఖ్య పెంపు హైదరాబాద్ : మందు బాబులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. దాంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరిగింది. అలాగే డిసెంబర్‌ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపింది.  గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల కేటాయించినట్టు ఆ శాఖ పేర్కొంది.  ఓపెన్‌ క్యాటగిరీ కింద 1,864 మద్యం దుకాణాలు మిగిలాయని చెప్పింది. మంగళవారం నుంచి ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించి ఈనెల 20న డ్రా ద్వారా కేటాయించనున్నారు.

*ప్రజా* *సమస్యలపై* *సత్వరమే* *స్పందించాలి* *అదనపు* *జిల్లా* *కలెక్టర్* *యస్.మోహన్* **రావు*

Image
 *ప్రజా* *సమస్యలపై* *సత్వరమే* *స్పందించాలి*   *అదనపు* *జిల్లా*  *కలెక్టర్* *యస్.మోహన్* **రావు*  సూర్యాపేట:  (మహమ్మద్ గౌసుద్దీన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుండి ప్రజలు వివిధ సమస్యలపై  అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యస్ మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో  అదనపు కలెక్టర్   పాల్గొన్నారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా వివిధ రకాల భూ సమస్యల దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు  ప్రజావాణిలో భూ సమస్యల పై 24 అలాగే ఇతర శాఖలకు సంబందించి 19 దరఖాస్తులు  మొత్తం 43 దరఖాస్తులు అందాయని  ఆయా శాఖల అధికారులు అట్టి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు  ఈ సమావేశంలో డి పి ఓ యాదయ్య సి పి ఓ వెంకటేశ్వర్లు పి డి ఐసీడీఎస్ జ్యోతి పద్మ ఈ డి శిరీష ఏ ఓ శ్రీదేవి వివిధ శాఖల అధికారులు  దరఖాస్తు దారులు తదితరులు పాల్గొన్నారు

Big Breaking.. _*'కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం రోజున రాష్ట్రం అంతటా ధర్నా చేస్తున్నాము: CM కేసీఆర్..'*_

Image
 Big Breaking.. _*'కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం రోజున రాష్ట్రం అంతటా ధర్నా చేస్తున్నాము: CM కేసీఆర్..'*_

డప్పు మోత, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ లో భారీఎత్తున పాల్గొనండి - జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి

Image
 డప్పు మోత,  నిరుద్యోగుల మిలియన్ మార్చ్ లో భారీఎత్తున పాల్గొనండి -  జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  నల్గొండ : జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశము లో  ఆయన మాట్లాడుతూ   దళిత బందు తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రేవు మంగళవారం జరిగే  డప్పు మోత మరియు ఉద్యోగ నోటిఫికేషన్లువెంటనే   ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న జరిగే  నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కు భారీఎత్తున జిల్లా నుండి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్ రెడ్డి, కంకణాల నివేదిత   నిమ్మల రాజశేకేర్ రెడ్డి, చనమోని రాములు,  వీరెల్లి చంద్రశేఖర్ కళ్యాణ్ నాయక్    బాబా  గోల్ ప్రభాకర్   బెజవాడ శేఖర్ కొండేటి సరిత  మరియు  అన్నీ మోర్చాల  అధ్యక్షులు  మండల పార్టీ అధ్యక్షులు  మండల పార్టీ  ప్రధాన కార్యదర్శులు  రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు  పాల్గొన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్@ప్రగతి భవన్.

Image
 ముఖ్యమంత్రి కేసీఆర్@ప్రగతి భవన్.  ప్రెస్ మీట్  పాయింట్స్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? లేదా ?  సమాధానం చెప్పే వరకు బీజేపీ నేతలని వదిలిపెట్ట౦. దేశాన్ని కాపాడమని చెబితే...నన్ను దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా ? తెలంగాణలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గనే రీతిలో బండి సంజయ్ వ్యాఖ్యలు... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రెండు వేల పెంక్షన్ ఇస్తున్నారా... కర్ణాటక,మధ్యప్రదేశ్ లలో దొడ్డి దారిన బీజేపీ అధికారంలోకి వచ్చింది.... బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.... తెలంగాణలో 107 స్థానాల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ రాలేదు.... బీజేపీ చెప్పింది వింటే దేశ భక్తులు.....ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే దేశ ద్రోహులు.... బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో.....పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు... దళిత ముఖ్యమంత్రి విషయంలో మాట తప్పిన మాట వాస్తవం,దానికి అనేక కారణాలున్నాయి....అయినా 2018 ఎన్నికల్లో గెలిచి తీరాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి  గెలుపొందడం బీజేపీకి అలవాటు... లక్షా 35 వేల ఉద్...

ఈటల కు చెందిన జమున హేచరీస్ కు నోటీసులు

 ఈటల  కు చెందిన జమున హేచరీస్ పై 16వ తేదీన విచారణ. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (Etela Rajender) భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం అయింది.  హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16న విచారణ చేపట్టనున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డికి చెందిన జమున హెచరీస్‌కు గతంలోనే నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూన్‌లోనే నోటీసులు జారీచేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీచేసినట్టుగా చెబుతున్నారు. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్

Image
 జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు  బెయిల్ హైదరాబాద్:  ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ , రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న పై నమోదు అయిన… అన్ని కేసుల్లోనూ… బెయిల్ మంజూరు అయినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.  సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ...

*తిరుమల లో "వెంకటేశ్వర స్వామి"ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు*

Image
 *తిరుమల లో "వెంకటేశ్వర స్వామి"ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు*

బూరుగడ్డ లో నాగుల చవితి

Image
 బూరుగడ్డ లో నాగుల చవితి బూరుగడ్డ లోని శ్రీ సంతాన నాగేంద్ర సహిత పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనువంశిక చైర్మన్ మంత్రిప్రగడ వెంకటేశ్వర్ రావు మరియు పూజారి బలరామ శర్మ తదితరులు భక్తులు పాల్గొన్నారు

*జవాన్లు పై తోటి జవాన్ కాల్పులు*

Image
  *జవాన్లు పై తోటి జవాన్ కాల్పులు* ◆ సుకుమా జిల్లా మారాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో CRPF 50 బెటాలియన్ లోని ఒక CRPF జవాన్  తోటి జవాన్ల్ పై కాల్పులు జరిపారు. ◆  ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు . ◆ మృత దేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.

*పోలీసులను ఏంట్రా అన్న యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు* *బాలరాజుకు చుక్కలు చూపిన పోలీసులు*

Image
  *పోలీసులను ఏంట్రా అన్న యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు* *బాలరాజుకు చుక్కలు చూపిన పోలీసులు*  సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం వాహనం అనుమతి సి.యం కేసీఆర్ కు మాత్రమే ఉంది.. మిగిలిన యం.ఎల్.ఏ లు..మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతం లో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి.. అందరు నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు..కానీ యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.. పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించం అని మర్యాదపూర్వకంగా చెప్పడం తో  గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండి పోలీసు అధికారులను *ఏంట్రా* అని నోరు జరారు అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజుకు *ఏంట్రా* అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ...

వరి కాకుండా ఇతర పంటలు వేసుకోండి - కేసీఆర్

Image
 వరి కాకుండా ఇతర  పంటలు  వేసుకోండి - కేసీఆర్ హైద్రాబాద్:  యాసంగిలో వరి కాకుండా ఇతర పంటలు వేసుకోండని రైతులకు కేసీఆర్  సూచించారు.  ధాన్యాన్ని  కేంద్రం  కొననంటున్నదని,  రైతులు యాసంగిలో వరి కాకుండా ఇతర పంటలు వేసుకొండని  తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని అన్నారు. యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారని,  రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే ...

నా పుట్టినరోజు సందర్బంగా పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా సహాయం చేయండి - తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

Image
  నా పుట్టినరోజు సందర్బంగా  పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా   సహాయం చేయండి - తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి   హైద్రాబాద్  : నా పుట్టినరోజు సందర్బంగా  పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా   సహాయం చేయండి. నాకు వ్యక్తిగతంగా  కలిసి శుభాకాంక్షలు  చెప్పిన దానికంటే  ఇది నాకు ఎక్కువ  సంతృప్తి  వస్తుందని  తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి  తెలిపారు  

ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్,

Image
  ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్, మిర్యాలగూడ:  మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల వద్ద రైతులు తీసుకువచ్చిన ధాన్యంకు మద్దతు ధర కల్పించే విషయంలో బిల్లులు, రైతులకు చేస్తున్న చెల్లింపులు, ఇతర విషయాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన వెంట మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఇతర పోలీస్ అధికారులు

*రేపు ఢిల్లీకి ఈటల.. టూర్ పై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ*

Image
*రేపు ఢిల్లీకి ఈటల.. టూర్ పై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ* *హుజురాబాద్* ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కనబరచడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఈటలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కాల్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. కాగా గెలుపు అనంతరం ఈటల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటల గెలుపు అనంతరం బీజేపీలో జోష్ మరింత ఎక్కువైంది. వాస్తవానికి హుజురాబాద్లో బీజేపీకి అనుకున్నంత కేడర్ లేదు. కేవలం ఈటల చరిష్మాతోనే ఉప ఎన్నిక బీజేపీ వశమైంది. కాగా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. *ఢిల్లీ పర్యటనలో అధిష్టానం సైతం భవిష్యత్ కార్యాచరణకు ఇదే దూకుడును కొనసాగించాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.  

వంట నూనె ధరలు తగ్గాయి

Image
 వంట నూనె ధరలు తగ్గాయి న్యూ ఢీల్లీ: ఎడిబుల్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయని ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే శుక్రవారం (నవంబర్ 5) మాట్లాడుతూ వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయని, రూ.20/- నుంచి రూ.18/-, రూ.10 వరకు తగ్గాయని తెలిపారు. /-, చాలా చోట్ల రూ 7/-. తగ్గాయి.

సూర్యపేట రహదారులకు మహర్దశ

Image
సూర్యపేట రహదారులకు మహర్దశ  కోటి రూపాయల అంచనా వ్యయం తో కొత్త రోడ్లకు శంకుస్థాపన కోటి 25 లక్షలతో మూడు కొత్త పార్కుల నిర్మాణం  శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్న మంత్రి జగదీష్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ సిబ్బంది సూర్యపేట : జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం రోడ్ల విస్తరణ తో సుందరీకరణ జరుగుతున్న నేపద్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టడంతో పట్టణ రోడ్లకు మహర్దశ పట్టినట్లైంది.అంతే గాకుండాముందెన్నడూ లేని రీతిలో ఏకకాలంలో కోటి 25 లక్షల అంచనా వ్యయంతో మూడు కొత్త పార్కులు నిర్మించాలి అన్న మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయం తో పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోనీ చారిత్రక ప్రాశయస్త్యం పొందిన సద్దుల చెరువు సమీపంలో 50 లక్షలతో నిర్మించ తలపెట్టిన పార్క్ తో పాటు రెండు పడకల ఇండ్ల నిర్మాణం తో పట్టణంలో పేరొందిన ఇందిరమ్మ కాలనిలో 50 లక్షలతో,ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో 25 లక్షల అంచనా వ్యయం తో నిర్మించ తలపెట్టిన పార్కులకు ఈ శనివారం ఉదయం స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.అంతే...

జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఎమ్ స్టోర్ లో దారుణం.. కేకలు పెట్టిన యువతి.

Image
 జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఎమ్ స్టోర్ లో  దారుణం.. కేకలు పెట్టిన యువతి. హైదరాబాద్:   డ్రెస్ కొనేందుకు వచ్చిన యువతి ట్రయిల్ రూమ్  బట్టలు మార్చుకుంటుండగా పక్కనున్న  ట్రయిల్ రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ ద్వారా చీత్రీకరించిన ఇద్దరు యువకులు. గమనించి కేకలు పెట్టిన యువతి. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు. వీడియో డిలీట్ చేయించిన యువతి  వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టార్ మేనేజర్  మీద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.

జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

Image
జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు నల్గొండ: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబురాలను డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన సతీమణి లావణ్య రంగనాధ్, కుమారుడు, కుమార్తెలతో పాటు కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. దీపావళి టపాసులు కాల్చుతూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అందరి జీవితాలలో దీపావళి వెలుగులు ప్రసరించాలని ఆయన ఆకాంక్షించారు.  

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

Image
 ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట: సంస్కృతి, సంప్రదయాలకు దీపావళి పండుగ నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చెడుపై సాధించిన మంచికి ఈ పండుగ ఒక చిహ్నం అని ఆయన చెప్పారు.ప్రజల జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకరావాలని ఆయన ఆకాంక్షించారు. అటువంటి పర్వదినోత్సవాన్ని జరుపుకోబోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి  ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ని సత్కరించిన వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ

Image
 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ని సత్కరించిన  వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ హైదరాబాద్: వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ   నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేశ్ గుప్తా ను  కలసి ఆయన ఆశిస్సులు అందుకున్నారు.  కలసిన వారిలో వీబీజీ ఫౌండేషన్ ఛైర్మన్  మడిపడగ రాము ,  వైస్ ఛైర్మన్ తాటిపెల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు  ఇమ్మడి రమేశ్ , ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ , ఫౌండర్స్  మడిపడిగ రాజు, శ్రీహరి లు ఉన్నారు.  తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కు వివరించారు. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా  ప్రత్యేకంగా ప్రశంసించారు.  ఫౌండేషన్ చేపట్టే దాతృత్వ కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గణేశ్ గుప్తా వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు.. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

15వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం.

Image
  హుజారాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు  8 గంటలకు పారంభమైంది.  15వ రౌండ్ లో బీజేపీ 2149 ఓట్ల ఆధిక్యం. మొత్తం అధిక్యం 11583