బీట్ మార్కెట్ శ్రీ వాసవి మాత దేవాలయం లో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు
బీట్ మార్కెట్ శ్రీ వాసవి మాత దేవాలయం లో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు
నల్లగొండలో బీట్ మార్కెట్ లో గల శ్రీ వాసవి మాత ఉమహేశ్వర సహిత శ్రీరామ కోటి స్థూప దేవాలయంలో ఈ నెల 7 నుండి 15 వరకు శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
7వ తేదీ బాల త్రిపుర సుందరి దేవి గా, 8వ తేదీ గాయత్రీదేవిగా, 9వ తేదీ లలితా దేవి గా, 10వ తేదీ అన్నపూర్ణాదేవిగా, 11వ తేదీ మహాలక్ష్మి మాతగా, 12వ తేదీ సరస్వతి దేవిగా, 13వ తేదీ దుర్గాదేవిగా, 14వ తేదీ మహిషాసుర మర్దినిగా, 15వ తేదీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తరించ వలసిందిగా నిర్వాహకులు కోరారు.
Comments
Post a Comment