రైతులను ప్రభుత్వం అయోమయానికి గురిచేస్తుంది, - జిల్లా బిజెపి అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి


 రైతులను ప్రభుత్వం  అయోమయానికి  గురిచేస్తుంది,   - జిల్లా బిజెపి అధ్యక్షుడు కంకణాల  శ్రీధర్ రెడ్డి

నల్గొండ:   తెలంగాణ రైతులను ప్రభుత్వం  అయోమయానికి  గురిచేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నల్గొండ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి   వరి వస్తే ఉరి అంటుంటే,   మంత్రలు జగదీష్ రెడ్డి వడ్లు వేయవద్దని, హరీష్ రావు మాత్రం హుజారాబాద్ ఎన్నికల ప్రచారం లో వరి వేయమని  చెప్పి రైతులను తిక మక  పెడుతున్నారని పేర్కొన్నారు.  వరి  వద్దంటున్న  ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేదని, వరి వద్దన్నపుడు రైతులకు లాభం చేకూరే  ప్రత్యామాయ పంటలు సూచించకుండా విత్తనాలు సమకూర్చకుండా  రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు  ప్రతి గింజ కొంటామన్న   రాష్ట్ర  ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం మీదకు నెడుతున్నారని, కేంద్రం  ఎప్పుడు కొనని చెప్పలేదని అన్నారు. ఇది అంత  ఉచిత విద్యుత్తు ఎత్తి వేసినందుకు పన్నాగమని, రాష్ట్రం లో 24 లక్షల బోర్ల క్రింద  వరి సేద్యం అవుతున్నదని దానికి విద్యుత్ ఇవ్వవలసి వస్తుందని, ఇప్పటికే ఉచిత విద్యుత్ బాపతు డిస్కం లకు వేల కోట్లు  రూపాయలు ప్రభుత్వం బాకీ పడ్డదని అన్నారు. రైతులకు ఎల్లవేళలా బీజేపీ మద్దతు ఉంటుందని,  రైతులు వరి సాగుచేసుకోవాలని,  మొత్తం  భారత  ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా  ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు యదగిరా చారి, కోశాధికారి విద్యాసాగర్ రెడ్డి, అధికార  ప్రతినిధి భూపతి రాజు, నవీన్ రెడ్డి,  బిసి  మోర్చ్  అధ్యక్షుడు భవాని,  దళిత మోర్చా అధ్యక్షుడు  గోలి  ప్రభాకర్, మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి, శ్యామ్, బలరాం తదిరలు పాల్గొన్నారు 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్