గవర్నర్ పర్యటన సందర్భంగా ఛాయ సోమేశ్వర ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
గవర్నర్ పర్యటన సందర్భంగా ఛాయ సోమేశ్వర ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఈనెల 7వ తేదీన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్ రాజన్ పర్యటన సందర్భంగా పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యవేక్షించారు.
ఏర్పాట్లలో భాగంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి (గైడ్) ను పిలిపించాలని, ఆలయం చుట్టు ప్రక్కలా ఎలాంటి ముళ్ళపొదలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ ప్రాంతంలో 5 మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి నామ పత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గవర్నర్ సందర్శించే ప్రదేశాలలో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
అనంతరo సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డియస్పి వెంకటేశ్వర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment