*ఫ్లాగ్ డే సందర్భంగా నేడు సైకిల్ ర్యాలీ*

 *ఫ్లాగ్ డే సందర్భంగా నేడు సైకిల్ ర్యాలీ*

- - 12వ బెటాలియన్ పోలీసులతో కలిసి పోలీస్ అమరులను స్మరిస్తూ  సైకిల్ ర్యాలీ

- - పోలీస్ ఉద్యోగం కాదు.... ఒక బాధ్యత


నల్లగొండ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా నేడు (మంగళవారం) పోలీస్ అమరవీరులకు స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద తెలిపారు.


పోలీస్ అమరులను స్మరిస్తూ 12వ బెటాలియన్ పోలీసులతో కలిసి జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ర్యాలీని డిఐజి ఏ.వి. రంగనాధ్ ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఎన్.జి. కళాశాల మీదుగా శివాజీ నగర్, రామగిరి రామాలయం, బస్టాండ్, సుభాష్ విగ్రహం, క్లాక్ టవర్ సెంటర్ నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ఈ సైకిక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.


పోలీస్ అనేది ఉద్యోగం కాదని అది ఒక బాధ్యత అని, నిబద్ధతతో సమాజం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల భద్రత లక్ష్యంగా పనిచేస్తారన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్