* తెలుకుంట్లశ్రీకాంత్ కు పూలే జాతీయ పురస్కారం*
* తెలుకుంట్లశ్రీకాంత్ కు పూలే జాతీయ పురస్కారం*
- - కోవిడ్ సమయంలో సేవలకు గుర్తింపు
నల్లగొండ : పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తేలుకుంట్ల శ్రీకాంత్ కు నేస్తం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో *పూలే జాతీయ సేవా పురస్కారం* లభించింది.
గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవంలో సినీ హీరో సుమన్, గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు, సినీ రచయిత ప్రసన్న కుమార్ ల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అటెండర్ నుండి ఐ.ఏ.ఎస్. వరకు సెలబ్రిటీలకు, క్రీడాకారులకు, గిన్నిస్ రికార్డు పొందిన వారు, వండర్, లిమ్కా బుక్ రికార్డు పొందిన వారు, వివిధ సంస్థల బ్రాండ్ అంబాసిడర్లుకున 52 మందికి అందజేసిన ఈ పురస్కారాల క్యాటగిరిలో సామాజిక సేవ విభాగంలో పురస్కారం అందించినట్లు నేస్తం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు టి.జి.లింగం గౌడ్ తెలిపారు.
కరోనా విపత్కర పరిస్థితుల క్రమంలో శ్రీకాంత్ నల్లగొండ పట్టబంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో కరోనా సోకిన వారికి ఇంటి వద్దకు, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారికి, రోడ్లపై విధి నిర్వహణ చేస్తున్న పోలీసులకు, లెప్రసి కాలనీ, అనాధ, వృద్ధాశ్రమాలలోని వారికి భోజనం అందించడం, మెడిసిన్ అవసరమైన వారికి మందులు తీసుకెళ్లి ఇంటి వద్ద ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున దాతల సహకారంతో మాస్కులు, సానిటైజర్లు అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందాడని, ఆయన సేవలకు గుర్తింపుగా తమ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారం అందించామని ఆయన వివరించారు.
Comments
Post a Comment