దటీజ్ డిఐజి రంగనాథ్* *మరోమారు సామాన్యుడికి అండగా నిలిచిన ఐపీఎస్*

 


*దటీజ్ డిఐజి రంగనాథ్*


*మరోమారు సామాన్యుడికి అండగా నిలిచిన ఐపీఎస్*


ఫ్రెండ్లీ పోలీసింగ్ తో నిత్యం సామాన్యులకు అండగా నిలుస్తారని పేరున్న నల్గొండ డిఐజి A.V. రంగనాధ్ గొప్పతనాన్ని చాటిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇంతకూ విషయమేమిటంటే.... ఖమ్మం జిల్లా కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యనారాయణ  హైద్రాబాద్ లోని మియపూర్ లో నివాసముంటున్నారు హైదరాబాద్ లో తనకున్న అస్తి అమ్మగా వచ్చిన సొమ్మును ఖమ్మం లో వసూలు చేసుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళుతున్నారు నల్గొండ జిల్లా చిట్యాల వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న నగదుకు ఆధారాలు చూపాలని కోరుతు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు 

నగదుకు సంభందించిన అన్ని ఆధారాలు చూపినా పోలీస్ స్టేషన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది దీంతో ఆందోళన కు గురైన బాధితుడు విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా డిఐజి రంగనాధ్ దృష్టికి తీసుకెళ్లారు తక్షణమే స్పందించిన డిఐజి రంగనాధ్ స్వయంగా బాధితుడికి ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడమే గాక నిమిషాల వ్యవధిలోనే సొమ్మును భద్రంగా ముట్టచెప్పాలని చిట్యాల ఎస్ ఐ ను ఆదేశించారు ఊహించని ఈ ఘటనతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన సత్యన్నారాయణ జరిగిన విషయాన్ని సన్నిహితులతో షేర్ చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది నిత్యం సామాన్యుల పక్షపాతిగా వ్యవహరిచే అధికారిగా పేరున్న ఐపీఎస్ రంగనాధ్ మరోసారి తన పోలీసింగ్ తో అందరిని ఆకట్టుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్