ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుంది - తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్
ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుంది - తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్
*రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఎక్కువ కొట్లాడాలని జయశంకర్ సార్ ఆనాడే చెప్పిండు....
ప్రాంతీయ పత్రికలను ముఖ్యమంత్రి ఆగం చేస్తుండు...
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.
*సెల్ ఫోన్ తోనే ప్రభుత్వానికి చెక్ పెడాదం..:
పాశం యాదగిరి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. మంగళవారం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిన్న పత్రికల సమస్యల పై
తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కప్పర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ నాడు ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత కన్నా ఇంకా ఎక్కువ పోరాటం చెయ్యాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే, చాలా మంది తమ లాంటి వారు మనుషుల్లా బతుకు తున్నారని పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రోజుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కనీస సహకారం అందించ లేదని,పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు.
కరోనా కష్ట కాలంలో హెలికాప్టర్ మనీ పేరుతో
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హడావిడి చూసి
ప్రజల్లో ఉన్న భరోసా కూడా కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, నిరుద్యోగులు,విద్యార్థులు, జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మన ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో గోదావరి నది నీళ్లు చూసి వస్తున్నారని ఎద్దేవా చేశారు. వార్తల్లో సత్యం ఉంటే జనాలు తప్పకుండా ఆదరిస్తారని, రాష్ట్ర ప్రజల సమస్య లపై తెగింపు తోనే కొట్లడాలని సూచించారు.
ఆంధ్రోళ్లను దింపిన మనకు ఈ కేసీయార్ ను దింపడం చాలా
సులభం అని, నిలబడి తెగించి, తేల్చుకుందాం అంటూ పిలుపు ఇచ్చారు. ఆసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదని,
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి శని పోయే కాలం దగ్గర్లోనే ఉందని, త్వరలో కేసీయార్ పీడ విరగడ కానుందని వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు
పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం కనిపించక పోయిన కనీసం పరిపాలన కనిపించాలని,
ప్రెస్ అకాడమీ కి పూర్తి స్థాయి సభ్యులు లేరని,
పెట్టుబడికి, కట్టు కథకు పుట్టిన విష పుత్రికలు పత్రికలు
అని ధ్వజమెత్తారు. ఉంపుడు గత్తెలు, పెంపుడు కుక్కలు గా పత్రికలు మారి పోయయని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టింది జర్నలిస్టులే అని,
సెల్ ఫోన్ తోనే ప్రస్తుత సమాజాన్ని శాసించవచ్చని అన్నారు. చిన్న, మద్యతరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
చిన్న పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు పూర్తిగా ఆగిపోయాయని, ఈ విషయమై పలువురు ప్రభుత్వ ప్రతినిధులకు,అధికారులకు విన్నవించినా, పలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడి టేషన్లు ఇవ్వాలని, తాత్కాలిక ప్రాతిపదికన అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఎంప్యానల్మెంట్ చేసినవారికి వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని,రెగ్యులర్ ఎంప్యానల్మెంట్ చేసి రేట్ కార్డ్స్ ఇవ్వాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంప్యానల్మెంట్ చేయాలని, ప్రతినెల ప్రకటనలుఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో
మైనారిటీ జర్నలిస్టుల ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షరీఫ్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు స్వామి, జంగిడి వెంకటేష్, నర్సింహ, బాలక్రిష్ణ, ఆజంఖాన్, అశోక్, దయానంద్, భూపతి రాజు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment