ముషంపల్లి నుండి నల్గొండ కు డబుల్ రోడ్డు సాధనకు పాదయాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్


ముషంపల్లి నుండి నల్గొండ కు డబుల్ రోడ్డు సాధనకు పాదయాత్ర  చేపట్టిన  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్


నల్గొండ: నల్గొండ మండలం ముషంపల్లి నుండి నల్గొండ జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్  పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాదగొని శ్రీనివాస్  గౌడ్ మాట్లాడుతూ ముషంపల్లి నుండి నల్గొండ వరకు డబుల్  రోడ్డు నిర్మించాలని డిమాండ్  చేశారు. ఉదయం ముషంపల్లి నుండి ప్రారంభమైన పాదయాత్ర కు ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది.   పాద యాత్ర సాగిన గ్రామాల  ప్రజలు  హారతుల  తో  ఘనంగా స్వాగతం పలికారు.  పాద యాత్ర సాయంత్రం నల్గొండ కు చేరుకొని అర్ అండ్ బి అధికారికి డబల్ రోడ్డు నిర్మాణం  చేయాలని కోరుతూ వినతి పత్రం  అండ చేశారు. పాదయాత్రలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి సాంబయ్య,  మండల అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ రెడ్డి,  మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు  ప్రసాద్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి,  రాష్ట్ర మైనార్టీ మోర్చ కార్యదర్శి బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు యదగిరా చారి, కోశాధికారి విద్యాసాగర్ రెడ్డి, అధికార  ప్రతినిధి భూపతి రాజు, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి, ప్రధాన కార్యదర్శి గణేష్, మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ నూకల వెంకట నారాయణ రెడ్డి, బొజ్జ నాగ రాజు, రావిరాల వేంకటేశ్వర్లు, సాయి,  భూపాల్ రెడ్డి, రాఖీ, సురేందర్ రెడ్డి,    సయ్యద్ పాషా, మహిళా నాయకురాళ్లు కాశమ్మ , ప్రసన్న  లక్ష్మీ, లు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్