వాసవి భవన్ లో ఘనంగా దసరా ఉత్సవాలు
వాసవి భవన్ లో ఘనంగా దసరా ఉత్సవాలు
నల్గొండ: నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో వాసవి భవన్ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత వాసవి మాత కు పూజలు నిర్వహించిన అనంతరం శమి పూజ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపి, వాసవి భవన్ ను అధినికరించుటకు పట్టణ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు యామా మురళి మాట్లాడుతూ వాసవి భవన్ ఆధునికరణకు గతం లో భాద్యతలు నిర్వహించిన వారితో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి భవన్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వీరెల్లి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనామా మనోహర్, నాంపల్లి నర్సింహ, కోటగిరి రామకృష్ణ, వందనపు వేణు, బుక్క ఈశ్వర్, గోవిందు బాల రాజు, భూపతి లక్ష్మీనారాయణ, వనమా రమేష్, మిరియాల మహేష్, బండారు హరి, గందేసిరి బాలాజీ, రేపాల పాండురంగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment