హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రచారం - నారగొని ప్రవీణ్ గౌడ్


హుజురాబాద్  ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రచారం -  నారగొని ప్రవీణ్ గౌడ్

     

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ లేఅవుట్ల లోని ప్లాట్స్  సంవత్సరం కాలం  గడిచిన రిజిస్ట్రేషన్ లు చేయడం లో విఫలం అయిందని, ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్షం వహిస్తున్నారని  ఆరోపిస్తూ  హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రచారం చేయడానికి సిద్ధం అవుతుందని  ఆ సంస్థ ప్రతినిధి నారగొని  ప్రవీణ్  గౌడ తెలిపారు. దసరా పండుగ తరువాత కార్యచరణ ప్రకటిస్తామని, సమస్యలు పరిష్కరించ మని ఎన్ని సార్లు విన్న వించుకున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లు ఉందని, 

సీఎస్ సోమేష్ కుమార్ నీ ఎన్ని సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని విమర్శించారు.

స్టాంప్స్ &రిజిష్టర్ ఐజి గకి సమస్య వివరించి గత ఆగస్టు లో హైకోర్టు ఇచ్చిన నిజాంపేట్ కు సంబంధించిన ఒక తీర్పు కాపీ కూడా ఇవ్వడం జరిగిందని అయిన సమస్య పరిష్కారం కాలేదని,  దీనితో  లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుచున్నారని

 అందుకే చలో హుజురాబాద్ అంటూ ఇంటింటికీ ప్రచారం చేద్దామని రైతులు రియల్టర్లు కదిలి రావాలని పిలువు నిచ్చారు.  హుజురాబాద్ లో ప్రభుత్వానికి వెతిరేకంగా ఎన్నికలలో పనిచేయడానికి  రావలసిందిగా కోరారు.


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్