"ఈటెల రాజేందర్ కు చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల మద్దతు"


 


 "ఈటెల రాజేందర్ కు చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల మద్దతు"


హైదరాబాద్: ఈటెల రాజేందర్ కు చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల మద్దతు ప్రకటించారు. హైద్రాబాద్ లోని  సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో చిన్న మధ్యతరహ పత్రికల ప్రతినిధులు  సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించి చిన్న పత్రికలకు అన్యాయం చేస్తున్న పాలక పార్టీకి బుద్ధి చెప్పేందుకు  ఈటెల కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా   యూసుఫ్ బాబు   మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల ఆత్మగౌరవం రోజురోజుకూ దెబ్బతింటున్నదని  తెలంగాణ ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొనడమేకాక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ వార్తలు వ్రాయడానికి, ప్రచురించడానికి భయపడుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమ వార్తలను ప్రతిరోజు ప్రముఖంగా ప్రచురించిన చిన్న, మధ్యతరహా, ప్రాంతీయ దినపత్రికలు, మ్యాగజైన్ల పీక పిసుకుతున్నారని ఆరోపించారు. . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ప్రాంతీయ పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని,  ప్రాంతీయ పత్రికలను నడుపుతూ తమకుతాము స్వయం ఉపాధి కల్పించుకోవడమేకాక, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ప్రాంతీయ పత్రికల సంపాదకులు నేడు అప్పులపాలై, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అనేకమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, పలువురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. . తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే పరిస్థితులు లేవని. జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలే  కాకుండా అందరి ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని,  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కళాకారులు చివరికి అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు, నిజాయితీగా పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు గౌరవం ఇవ్వడంలేదన్నారు            అందుకే ప్రజస్వామ్య తెలంగాణ, స్వేచ్ఛగా జీవించే తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధనకోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని. నిరంకుశంగా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం మరో ఉద్యమం చేపట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులపై ఉందని, . మరో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా, మ్యాగజైన్స్ అసోసియేషన్, వివిధ జర్నలిస్ట్ సంఘాలతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడే సంఘాలకు, పార్టీలకు అండగా ఉండాలని నిర్ణయించామని  ఈ ఉద్యమంలో భాగంగా హుజురాబాద్ నుండి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ గారికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.                అప్పులతో, అనారోగ్యంతో, ఆత్మగౌరవాన్ని చంపుకుని అబద్ధాల బంగారు తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకోవడం, చావడంకన్నా పోరాడి చావడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.  2018 ఎన్నికల తర్వాత ప్రాంతీయ పత్రికల పరిస్థితి మరీ దారుణంగా మారిందని,       ఉమ్మడి రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటనలు రెగ్యులర్ గా సమాచార శాఖ కార్యాలయం నుండి క్లాసిఫైడ్, డిస్ప్లే, భూసేకరణ ప్రకటనలు ఇచ్చేవారని,  జిల్లాల్లో కలెక్టర్ లు వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలు ఇచ్చేవారని, దేవాలయాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల నుండి నేరుగా వీలును బట్టి రొటేషన్ పద్ధతిన అందరికీ ప్రకటనలు ఇచ్చేవారని,  కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక పత్రికలకు సరిగ్గా ప్రకటనలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.   2018 నుండి పత్రికలను ప్రతిరోజూ సమాచార శాఖ కార్యాలయంలో నెలకు 25 రోజులు ఖచ్చితంగా వేయాలని నిబంధనలు పెట్టి నెల నెలా ప్రకటనలు ఇస్తామని చెప్పి గత మూడు సంవత్సరాలుగా పత్రికలు వేయించుకుంటున్నారని,  ప్రకటనలు మాత్రం ఇవ్వడంలేదని. జిల్లాల్లో వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, దేవాలయాలు ఎలాంటి ప్రకటనలు పత్రికలకు నేరుగా ఇవ్వకుండా, అలాగే భూసేకరణ ప్రకటనలు  జిల్లా కలెక్టర్ లు, ప్రత్యేక కలెక్టర్లు నేరుగా ఇవ్వకుండా సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంద్వారానే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం తో ప్రాంతీయ పత్రికలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.    ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదలుకొని ముఖ్యమైన మంత్రులకు, అధికార పార్టీలోని ముఖ్యులకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, . సమాచార శాఖ కమిషనర్ మొదలుకొని అందరు అధికారులకు విజ్ఞప్తి చేసామని, అప్పుడప్పుడు మా బాధలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నాలు చేసామని,  నిరసన ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు.ముఖ్యమంత్రితో సహా అందరూ హామీలు ఇచ్చారు తప్ప మాకు న్యాయం చేయలేదని వాపోయారు.   ప్రభుత్వం తమ పార్టీకి సంబంధించిన పత్రికలకు, తమకు అనుకూలంగా ఉన్న ఒకటి రెండు పత్రికలకు, అసలు మన ప్రాంతంలో సర్క్యులేషన్ లేని, తెలుగు రాష్ట్రాలకు సంబంధంలేని పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.  భూసేకరణ ప్రకటనలు తక్కువ రేట్ ఉన్న పత్రికలకు ఇవ్వకుండా వేల రూపాయల రేట్లున్న పత్రికలకు ఇస్తున్నారని,  వందలాది మంది జర్నలిస్టులకు ఉపాధి కల్పిస్తున్న పత్రికలకు ఒకవైపు  సమాచార శాఖ ప్రకటనలు ఇవ్వకపోవడం,  మరోవైపు కరోనాతో ప్రయివేటు ప్రకటనలు రాక పత్రికలు ఆర్థికంగా దెబ్బతిని జర్నలిస్టుల ను తొలగిస్తున్నారని,  ఎంతోకాలంగా జర్నలిజం వృత్తిని నమ్ముకొని నిజాయితీగా పనిచేసినవారు బంగారు తెలంగాణాలో బజారు పాలయ్యారని,   వేరే పని చేయలేక, వేరే ఉద్యోగాలు చేసేందుకు వయోపరిమితి తీరిపోయి చిన్న పత్రికలలో, యూ ట్యూబ్ ఛానళ్లలో చేరి చాలీచాలని జీతాలతో ఉస్సూరుమంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు..       మన బంగారు తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన నాటినుండి నేటివరకు ముఖ్యమైన సమాచార శాఖకు మంత్రిలేకపోవడం దురదృష్టకరమన్నారు.

రెగ్యులర్ కమిషనర్ లేరని,   అంతా ఇంచార్జ్ లేనని, జర్నలిస్టుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. .ప్రాంతీయ పత్రికల సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ ఏడేళ్లలో ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు ఫలితం కనిపించడంలేదని గత మార్చ్ 7 న జలవిహార్ లో జర్నలిస్టుల సభలో వేలాది జర్నలిస్టుల సమక్షంలో అనేక హామీలు ఇచ్చారని, ఏవీ అమలుకాలేదని. అసలు వాటి గురించి చర్చేలేదని తెలిపారు.               కరోనా సమయంలో జర్నలిస్టులు ముఖ్యంగా మండలాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, చిన్న, మధ్యతరహా దినపత్రికలు, మ్యాగజైన్ల సంపాదకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని. ప్రభుత్వం తరపున వివిధ రంగాలవారికి ప్రభుత్వం తరపున సహాయం అందించారని, న్యాయవాదులకు ఆర్ధిక సహాయం అందించారని కానీ జర్నలిస్టులు మొండి చెయ్యి చూపరని పేర్కొన్నారు.  కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం బంగారు తెలంగాణా అంటూ గొప్పలు చెప్పుకొనే నాయకులు ఒక్కసారి గుండెమీద చెయ్యివేసుకుని ఆలోచించండని కోరారు.. నిజంగా మనది బంగారు తెలంగాణానేనా, లాఠీ దెబ్బలు  తిని, కెమెరాలు పగలగొట్టుకొని, సెల్ఫోన్లు పోగొట్టుకుని, యాజమాన్యాల వేధింపులను తట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని, తిండీతిప్పల్లేక, రాత్రీపగలు తేడాలేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమేకాకుండా, పలుసందర్భాల్లో పోలీసులనుండి తెలంగాణ ఉద్యమకారులను రక్షించిన తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఏం మేలు  చేసిందని వారు ప్రశ్నించారు.

 బంగారు తెలంగాణాలో అడుగడుగునా అవమానాలేనని,  ప్రభుత్వానికి అండగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలను లేకుండా చేయకపోవడం, అసలు ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తున్నారని,

జర్నలిస్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ, గౌరవం ఈరోజు కొట్లాడి సాధించ్చుకున్న తెలంగాణలో కరువు అయ్యిందని,   ఆంధ్రా పాలకుల కాలంలో వాళ్లకు నచ్చిన ఒకట్రెండు పత్రికలకు ప్రకటనలు కొన్ని ఎక్కువ ఇచ్చినా మిగతా పత్రికలకూ ఇచ్చేవారని,  చిన్న, మధ్యతరహా పత్రికలు, మ్యాగజైన్లకు ఇచ్చి ప్రోత్సహించేవారని , ఎవరైనా ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు అనారోగ్యంపాలైతే ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చి, బిల్లులు వెంటనే ఇచ్చి ఆదుకునేవారని తెలిపారు.      ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులను , ముఖ్యమంత్రులను స్వేచ్ఛగా జర్నలిస్టులైనా, జర్నలిస్ట్ సంఘాల నాయకులైనా కలిసే అవకాశం ఉండేదని,  ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులను సెక్రటేరియట్ లో, అసెంబ్లీలో, ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాల్లో  ఎక్కడైనా స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉండేదని. ఎవరైనా వ్యక్తిగతంగా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ అడిగితే  ఇచ్చేవారని, కలిసేవారని ఇవ్వాళ్ళ ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ లోకి రానివ్వరని, ప్రగతిభవన్ పరిసరాల్లోకి అనుమతించరని,  ప్రగతిభవన్ లో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితే వార్తలు సేకరించాలంటే ప్రగతిభవన్ గేట్లముందు రోడ్డుపై గంటలకొద్దీ దోమలమధ్య జాగారం చేయాలని, . అధికార పార్టీ వార్తలు సేకరించాలంటే తెలంగాణా భవన్ గేట్లముందు రోడ్లపై గంటల కొద్దీ కాళ్ళీడ్చుకుంటూ నిలబడాలని, ఇక ఏ మంత్రి ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు జరిగేవి కానీ కోరి కొట్లాడితెచ్చుకున్న బంగారు తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు. రైతుల ఆత్మహత్యలు ప్రతిరోజు జరుగుతున్నాతని,  ఇక జర్నలిస్టుల విషయానికొస్తే తెలంగాణలో ఉన్న దుస్థితి మరెక్కడాలేదుని, ప్రశ్నించే గొంతులను నొక్కడం,  ప్రజాస్వమ్యం అనేదే ఉండకూడదనే  భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళనుండే జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నాలు మొదలయ్యాయని. అసలు సచివాలయంలోకి జర్నలిస్టులను రాకుండా చేయాలనే ప్రయత్నాలు జరిగాయన్నారు. పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ వేడుకల్లో జర్నలిస్టుల గ్యాలరీ మొదటినుంచి ఉన్నట్లు కాకుండా వేదికకు దూరంగా జరపడం, ముఖ్యమంత్రి చాంబర్లోకి ఎంట్రీ లేకుండా నిబంధనలు, అసెంబ్లీలో గతానికి భిన్నంగా నిబంధనలు విధించారని, .   చివరికి కొంతమంది అధికారులు కూడా పాలకుల బాటలో నడుస్తూ జర్నలిస్టులకు సరైన గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్