*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటం*
*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటం*
- తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని
-కరీంనగర్ నూతన కమిటీ నియామకం
హైదరాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో అపరిషృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల సాధనకు సమరశీల పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాలో శుక్రవారం రోజున టిజేఏ జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ నగునూరి అద్వర్యం లో రాష్ట్ర అధ్యక్షుడు నారగొని పురుషోత్తం ఆదేశాల మేర ప్రకటించడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని అధ్యక్షుడిగా , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్ ను నియమించినట్లు పురుషోత్తం నారగౌని తెలిపారు. అలాగే జిల్లా గౌరవాధ్యక్షుడిగా దీపక్ బాబు, ఉపాధ్యక్షుడిగా శ్రీ క్రాంతికుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆడెపు రవికుమార్, కోశాధికారిగా శ్రీ రాపెల్లి కుమార్ ను నియమించామని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పని చేయాలని అలా కాని పక్షంలో జర్నలిస్టుల ఆగ్రహాన్ని చూడవలిసి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని చిన్న పత్రికల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, వాటికి ప్రకటనలు లేక కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జర్నలిస్టులు పోరుబాట పట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని పురుషోత్తం నారగౌని అన్నారు.నూతన కమిటీ సభ్యులు వారి నియామకము పట్ల సంతృప్తి ని వ్యక్తపరుస్తూ రాష్ట్ర కమిటీ కి కృతజ్ఞతలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల ఎప్పుడు తమ వంతు బాధ్యత గా పోరాడుతామని తెలిపారు.
Comments
Post a Comment