భారత్ లో 100 కోట్లకు చేరిన వాక్సినేషన్, జి. 7 దేశాల కంటే భారత్ లోఎక్కువ సంఖ్యలో వాక్సినేషన్- జిల్లా బిజెపి అద్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి


 

భారత్ లో 100 కోట్లకు చేరిన వాక్సినేషన్,  జి. 7 దేశాల కంటే  భారత్ లోఎక్కువ సంఖ్యలో   వాక్సినేషన్- జిల్లా బిజెపి అద్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి

నల్గొండ: జి. 7 దేశాల కంటే  భారత్ లోఎక్కువ సంఖ్యలో కారోన వాక్సినేషన్  వేయడం జరిగిందని జిల్లా బిజెపి అద్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు. 100 కోట్ల కారోన వ్యాక్సిన్ పూర్తి ఆయిన సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల లో ఆయన  మాట్లాడుతూ నరేంద్రమోదీ  కారోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడిన మనిషని,  ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వాక్సిన్ పూర్తి చేసిన ఘనత  మోడీదే నని అన్నారు. 100 కోట్ల వాక్సిన్ పూర్తి అయిన సందర్భంగా రేపు పండుగ కార్యక్రమం నిర్వహస్తున్నామని,  వైద్య సిబ్బందిని సన్మానిస్తామని, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ కి  పాలాభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాక్సినేషన్ సెంటర్లో , ప్రతి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహిస్తున్నట్లు తెలుపారు. బీజేపీ జిల్లా శాఖ పక్షాన నరేంద్ర మోడీ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి, చెనమోని రాములు, ఐతగొని అంజయ్య, భవాని ప్రసాద్ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్