నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నవంబర్ 28న , ఎన్నికల నోటిఫికేషన్ 3వ తేదీన
నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నవంబర్ 28న , ఎన్నికల నోటిఫికేషన్ 3వ తేదీన మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం మిర్యాలగూడ పట్టణంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆతిథ్యంతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నవంబర్ 28 తేదీన నిర్వహించాలని కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది . నవంబర్ 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈలోగా జిల్లాలోని అన్ని మండల, పట్టణ మహా సభల ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్టు జిల్లా అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ హాజరయ్యారు . రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరె లక్ష్మణ్ మిర్యాలగూడ రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌ...